ట్రాక్టర్ మధ్యలో ఇరుక్కుని యువకుడు మృతి
మోత్కూర్ 03 జనవరి 2026 తెలంగాణ వార్త రిపోర్టర్
యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరు మండలంలోని సదర్శాపురం గ్రామంలో శనివారం విషాదకర ఘటన చోటుచేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం, గ్రామానికి చెందిన తుంగపాటి యాకరాజు (38), తండ్రి హనుమయ్య, పొలంలో దున్నే పనిలో ఉన్న సమయంలో ట్రాక్టర్ దిగబడింది. దాన్ని బయటికి తీసే ప్రయత్నంలో ట్రాక్టర్ అదుపు తప్పి వెనక్కి తిరగబడటంతో, కల్టివేటర్ మధ్యలో ఇరుక్కొని యాకరాజు అక్కడికక్కడే మృతి చెందినట్లు గ్రామస్తులు తెలిపారు. ఘటన సమాచారం అందుకున్న స్థానికులు, కుటుంబ సభ్యులు ఘటనా స్థలానికి చేరుకుని గుండెలు అవిసెల విలపించారు.. మృతునికి భార్యతో పాటు ఇద్దరు పిల్లలు ఉన్నారు దీంతో కుటుంబం మరియు గ్రామం శోకసంద్రంలో మునిగిపోయింది.ఈ ఘటనపై పోలీస్ లు ఘటన స్థలానికి చేరుకొని, విచారణ ప్రారంభించారు....