ప్రభుత్వం విద్యుత్ కార్మికులకు తగిన న్యాయం చేయాలి
జిల్లా అధ్యక్షులు బోయిల విద్యాసాగర్
సూర్యాపేట 1 మార్చి 2026 తెలంగాణవార్త రిపోర్టర్:– సూర్యాపేట డివిజన్ కు చెందిన విద్యుత్ మీటర్ రీడర్ కార్మిక సంఘం నాయకులు మరియు కార్మికులు తమ న్యాయమైన డిమాండ్ల సాధన కోసం విద్యుత్ సర్కిల్ ఆఫీసు ముందు నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు.ఈ సందర్భంగా జిల్లా ప్రధాన కార్యదర్శి ధరావత్ నాగేశ్వర్ నాయక్ మాట్లాడుతూ.. రాష్ట్రవ్యాప్తంగా మీటర్ రీడర్స్ గత 20 సంవత్సరాలుగా విద్యుత్ శాఖలో సేవలందిస్తున్నారని తెలిపారు.మీటర్ రీడింగ్ మాత్రమే కాకుండా లైన్మెన్ల పనులు కూడా నిర్వర్తిస్తూ ప్రాణాలను పణంగా పెట్టి విద్యుత్ స్తంభాలు ఎక్కి బాధ్యతతో విధులు నిర్వహిస్తున్నారని చెప్పారు.అయితే నెలలో కొద్ది రోజులు మాత్రమే పని దొరకడం వల్ల ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతున్నాయని, మిగతా రోజులకు ఉపాధి లేక కుటుంబాలు కష్టాల్లో ఉన్నాయని కార్మికులు ఆవేదన వ్యక్తం చేశారు. విద్యుత్ యాజమాన్యం వెంటనే స్పందించి పీసు రేటు విధానం ను రద్దు చేసి నెలలో పూర్తి 30 రోజుల పని దినాలు కల్పించి జీవో నెంబర్ 11 ప్రకారం కనీస వేతనాలు ఇవ్వాలి,కాళిగా ఉన్నటువంటి సబ్ స్టేషన్ లలో ఆపరేటర్ గా తీసుకొని ఆర్టిజన్ లు గుర్తించాలని డిమాండ్ చేస్తున్నాము.మా మీటర్ రీడర్ కార్మికుల న్యాయమైన సమస్యలు పరిష్కారం అయ్యేవరకు విధులకు హాజరుకాబోమని ఈ సందర్భంగా స్పష్టంగా తెలియజేస్తున్నాము. అనేక సార్లు అధికారులకు మరియు ప్రజా ప్రతినిధులకు నాయకులకు అనేక సార్లు వినతి పత్రాలు ఇచ్చిన వారి నుండి ఎలాంటి స్పందన లేకపోవడంతో ఈరోజు నుండి మీటర్ రీడింగ్ పనులను నిలిపివేసి రేపు హైదరాబాద్ ధర్నా చౌక్ వద్ద జరగబోయే ధర్నా విజయవంతం చేయాలని విద్యుత్ మీటర్ రీడర్ కార్మికులకు విజ్ఞప్తి చేశారు.ఈ కార్యక్రమంలో సూర్యాపేట జిల్లా అధ్యక్షులు బోయిల్లా విద్యాసాగర్,చిలుక శ్యామ్,అభినవ్,విష్ణు, మహమ్మద్,షఫీ, శ్రీకాంత్,నవీన్, సురేందర్,వెంకటేశ్వర్లు, భార్గవ్,గణేష్,శివాజీ, పృద్వి,శరత్,సందీప్, ఆంజనేయులు,మహేష్, గిరి,తదితరులు పాల్గొన్నారు.