భారతీయ జనతా పార్టీ మున్సిపల్ ఎన్నికల అభ్యర్థుల జాబితా విడుదల
అభ్యర్థులను పార్టీ కండువాతో సన్మానించిన మాజీ శాసనసభ్యులు సంకినేని
సూర్యాపేట పట్టణంలోని త్రిబుల్ ఆర్ ఫంక్షన్ హాల్లో మున్సిపల్ ఎన్నికల కన్వీనర్ జుట్టుకొండ సత్యనారాయణ ఆధ్వర్యంలో పట్టణ బీజేపీ సమావేశం ఘనంగా జరిగింది. ఈ సమావేశానికి ముఖ్యఅతిథులుగా మాజీ శాసనసభ్యులు సంకినేని వెంకటేశ్వరరావు , జిల్లా ఇన్చార్జి తుటిపల్లి రవి , రాష్ట్ర కార్యవర్గ సభ్యులు వీరెల్లి చంద్రశేఖర్ , హాజరై అభ్యర్థులకు దిశానిర్దేశం చేశారు.
*ప్రధానాంశాలు:*
???? సూర్యాపేట మున్సిపాలిటీపై బీజేపీ జెండా ఎగురవేయడమే లక్ష్యం.
???? అభ్యర్థులెవరూ అలసత్వం వహించకుండా ఇంటింటి ప్రచారం నిర్వహించాలి.
*???? *సూర్యాపేట పట్టణ మున్సిపల్ అభ్యర్థుల ఖరారైన బీజేపీ అభ్యర్థుల వివరాలు:*
*1 వార్డ్ అభ్యర్థిగా బానోతు నరసింహ*
*2 వార్డ్ అభ్యర్థిగా అంతటి నగేష్*
*3 వార్డ్ అభ్యర్థిగా పడిదల కిరణ్*
4 వార్డ్ అభ్యర్థిగా సిరిపంగి ప్రసాద్ స్వాతి
6 వార్డ్ అభ్యర్థిగా బండపల్లి శ్రీనివాస్
7 వార్డ్ అభ్యర్థిగా ఎడ్ల శివకుమార్
8 వార్డ్ అభ్యర్థిగా పోతురాజు సాగర్ శోభారాణి
9 వార్డ్ అభ్యర్థిగా గుండగాని జానీ గౌడ్ రమణ
10 వార్డ్ అభ్యర్థిగా మర్రి చంటి
11 వార్డ్ అభ్యర్థిగా గుడిసె ఊర్మిళ వెంకన్న
12 వార్డ్ అభ్యర్థిగా ఓబులోజు వెంకటాచారి
14 వార్డ్ అభ్యర్థిగా గట్ల ఉమేష్
15 వార్డ్ అభ్యర్థిగా తాడూరి జ్యోతి
16 వార్డ్ అభ్యర్థిగా సలిగంటి వీరేందర్
17 వార్డ్ అభ్యర్థిగా కుoచం సురేష్ మహేశ్వరి
18 వార్డ్ అభ్యర్థిగా బొల్లం నాగమణి
19 వార్డ్ అభ్యర్థిగా పిడమర్తి కీర్తి లవన్
20 వార్డ్ అభ్యర్థిగా గోగుల రమేష్ నాగలక్ష్మి
21 వార్డ్ అభ్యర్థిగా పొడపంగి రత్నం రమణకుమారి
22 వార్డ్ అభ్యర్థిగా పెండ్ర కృష్ణ కమలమ్మ
24 వార్డ్ అభ్యర్థిగా గజ్జల వెంకటరెడ్డి
25 వార్డ్ అభ్యర్థిగా పిట్టల వెంకన్న ప్రమీల
26 వార్డ్ అభ్యర్థిగా కందుల రమేష్ లీల
27 వార్డ్ అభ్యర్థిగా కుoచం యాదగిరి దుర్గ
28 వార్డ్ అభ్యర్థిగా తప్పెట్ల విజయకుమార్
29 వార్డ్ అభ్యర్థిగా దొంతగాని మాధవి
30 వార్డ్ అభ్యర్థి గా మామిడి లక్ష్మమ్మ
31 వార్డు అభ్యర్థిగా దోసకాయల ఫణి నాయుడు
32 వర్డ్ అభ్యర్థిగా ధరావత్ లింగ నాయక్
33 వార్డ్ అభ్యర్థిగా దండ రవిచందర్ రెడ్డి
34 వార్డ్ అభ్యర్థిగా శివరాత్రి రవి
35 వార్డ్ అభ్యర్థిగా ఆకారపు ఉషారాణి పరిపూర్ణ చారి
36 వార్డ్ అభ్యర్థిగా ఎల్గూరి రామ్మూర్తి గౌడ్ నాగమణి
37 వార్డ్ అభ్యర్థిగా మహమ్మద్ అబిద్
38 వార్డు అభ్యర్థిగా ఆరూరి శివ
39 వార్డ్ అభ్యర్థిగా బహురోజు రాజశేఖర్ కవిత
40 వార్డు అభ్యర్థిగా వీరెల్లి ఉమా
41 వార్డ్ అభ్యర్థిగా మామిడి నాగరాజు యాదవ్
42 వార్డు అభ్యర్థిగా చల్లమల్ల నరసింహ
43 వార్డ్ అభ్యర్థిగా పలస మహాలక్ష్మి మల్సూర్ గౌడ్
44 వార్డ్ అభ్యర్థిగా బూర లక్ష్మణ్ రమాదేవి
45 వార్డ్ అభ్యర్థిగా నూకల శైలేందర్ రమాదేవి
46 వార్డ్ అభ్యర్థిగా పోలోజు మౌనిక
47 వార్డ్ అభ్యర్థిగా పోలగానీ ధనుంజయ గౌడ్
48 వార్డ్ అభ్యర్థిగా కారింగుల దీప లను ప్రకటించారు...
ఈ సందర్భంగా మాజీ శాసనసభ్యులు సంకినేని వెంకటేశ్వరరావు మాట్లాడుతూ బీజేపీ రాష్ట్రవ్యాప్తంగా ప్రతి మున్సిపాలిటీలో అన్ని వార్డులో పోటీ చేస్తుందని ,ఈసారి బిజెపికి ప్రజల మద్దతు పెరిగిందని అన్నారు. ప్రజలు బిజెపికి ఓటు వేయడానికి సిద్ధంగా ఉన్నారని , నాయకులు కలిసిమెలిసి విజయం కోసం పనిచేయాలని వారు తెలిపారు. ప్రతి వార్డులో పార్టి కార్యాలయం ప్రారంభించాలని పార్టీ జెండాలతో ప్లెక్సిలను కలిగిన ఆటోలను ఏర్పాటు చేసుకొని ప్రచారం చేసుకోవాలని చెప్పారు. ప్రతి వార్డులో ప్రతి ఇంటికి వెళ్లే గడపగడపకు బిజెపి అనే నినాదంతో ప్రచారం చేయాలని పిలుపునిచ్చారు .. దేశంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తుందని మునిసిపాలిటీలకు నేరుగా నిదులను ఇస్తుందని, గ్రామాల్లో రోడ్లు అంగన్వాడీ కేంద్రాలకు పోషకాహారం, జాతీయ రహదారుల నిర్మాణం మోడి ప్రభుత్వం చేస్తుందని అన్నారు.
ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షురాలు చల్లా శ్రీలత రెడ్డి, అసెంబ్లీ కన్వీనర్ కర్నాటి కిషన్ ,జిల్లా ప్రధాన కార్యదర్శి చల్లమల్ల నరసింహ, మున్సిపల్ ఎన్నికల కో కన్వీనర్ రంగరాజు రుక్మారావు, తుక్కాని మన్మధ రెడ్డి మరియు జిల్లా ముఖ్య నాయకులు పాల్గొన్నారు