తిరుమలగిరి మున్సిపల్ విజేతలు......చైర్మన్ పీఠాన్ని దక్కించుకున్న బిఆర్ఎస్

Feb 14, 2026 - 06:22
 0  547
తిరుమలగిరి మున్సిపల్ విజేతలు......చైర్మన్ పీఠాన్ని దక్కించుకున్న బిఆర్ఎస్

 తిరుమలగిరి  14 ఫిబ్రవరి 2026 తెలంగాణ వార్త రిపోర్టర్:

ఉత్కంఠ భరితంగా సాగిన  కౌంటింగ్.

10 బిఆర్ఎస్ 5 కాంగ్రెస్.... 

మున్సిపల్ లో రెపరెపలాడిన గులాబీ జెండా.... 

తిరుమలగిరి మున్సిపల్ ఎన్నికల్లో 15 వార్డులకు గాను 10 వార్డులు కైవసం చేసుకుని భారత రాష్ట్ర సమితి (బిఆర్ఎస్) మున్సిపల్ చైర్మన్ పీఠాన్ని దక్కించుకుంది. 05 వార్డులు గెలుచుకున్న ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ మ్యాజిక్ ఫిగర్ దాటలేకపోయింది. ఎన్నికల ప్రకటన నాటి నుంచి టిఆర్ఎస్ దిమాగం ముందడుగు వేసింది చైర్మన్ అభ్యర్థులు ముందుగానే ప్రకటించి వార్డు స్థాయిలో సమన్వయం చేస్తూ వ్యూహాత్మకంగా ప్రచారాన్ని నడిపింది. గ్రామీణ శైలిలో ఇంటింటికి చేరి ఓటర్లను ఆకట్టుకోవడంలో విజయం సాధించింది. చైర్మన్ పీఠం మాదే అన్న నినాదంతో ప్రారంభించిన ప్రచారం ఫలితాల రూపంలో నిజమైంది. మొత్తం ఫలితాల్లో టిఆర్ఎస్ పది స్థానాలు గెలుచుకొని మున్సిపల్ చైర్మన్ పీఠం దక్కించుకునే దిశగా అడుగులు వేస్తుండగా కాంగ్రెస్ పార్టీ ఐదు స్థానాలతో ప్రతిపక్షంగా నిలిచింది. దీంతో తిరుమలగిరి మున్సిపాలిటీలో బి ఆర్ ఎస్ విజయం పార్టీ శ్రేణులలో ఉత్సాహాన్ని నింపింది.

ఇక కాంగ్రెస్ పార్టీ విషయంలో మాత్రం వ్యూహాత్మక లోపాలు ప్రతికూలంగా మారినట్లు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అభ్యర్థుల ఎంపికలో ఆలస్యం, బీఫారం జారీ విషయంలో తడబాటు, ముఖ్యంగా చైర్మన్ అభ్యర్థిని ని ముందుగానే ప్రకటించకపోవడం పార్టీకి నష్టమైందని రాజకీయ మేధావులు విశ్లేషిస్తున్నారు. అంతర్గత సమన్వయ లోపం కూడా ప్రభావం చూపిందని చెబుతున్నారు. తిరుమలగిరి రాజకీయాల్లో టిఆర్ఎస్ వివాహం పలించగా కాంగ్రెస్ పార్టీకి ఆత్మ పరిశీలన అవసరమని స్థానిక వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.

 మొత్తం 15 వార్డులకు జరిగిన ఎన్నికల్లో భారత రాష్ట్ర సమితి స్పష్టమైన ఆదిత్యను సాధించింది 10 వార్డులను తెలుసుకొని మున్సిపాలిటీపై తన ఆధిపత్యాన్ని చాటుకుంది 

 వార్డుల వారీగా విజేతలు...

 1వ వార్డు పనికెరా లక్ష్మి ( బిఆర్ఎస్ )76 ఓట్లతో విజయం

2వ వార్డు జక్కుల రమేష్ (బిఆర్ఎస్) 74 ఓట్లతో విజయం 

3.వ వార్డ్ కారు పోతుల సోమలక్ష్మి నరేష్ (బిఆర్ఎస్ )88 ఓట్లతో విజయం

4.వ వార్డు బత్తుల శకుంతల (బిఆర్ఎస్)98 ఓట్లతో విజయం

5.వార్డ్ తిరుమణి యాదగిరి( కాంగ్రెస్)83 ఓట్లతో విజయం

6.వ వార్డు కేసిడి కవిత వెంకటరెడ్డి 

( కాంగ్రెస్) 89 ఓట్లతో విజయం

7.వ వార్డు బత్తుల శ్రీను (కాంగ్రెస్) 78 ఓట్లతో విజయం

8.వ వార్డు చిలుక వెన్నెల అంజి (కాంగ్రెస్)73 ఓట్లతో విజయం

9.వ వార్డు కన్నెబోయిన మల్లయ్య (కాంగ్రెస్) 123 ఓట్లతో విజయం

10.వార్డు భూక్య యాకూబ్ నాయక్ (బిఆర్ఎస్)02 ఓట్లతో విజయం

11.వార్డ్ ఏమోజు గోవిందమ్మ రవీందర్ 

(బి ఆర్ ఎస్) 321 ఓట్లతో విజయం

12.వార్డ్ కందుకూరి గీత బాబు 

(బిఆర్ఎస్ ) 150 ఓట్లతో విజయం

13.వ వార్డు సంకేపల్లి సంకేపల్లి జ్యోతి నరోత్తం రెడ్డి (బిఆర్ఎస్ ) 67 ఓట్లతో విజయం.

14.వ వార్డు సంకేపల్లి రఘునందన్ రెడ్డి (టిఆర్ఎస్) 128 ఓట్లతో విజయం.

15.వ వార్డు పత్తేపురం త్రిశూల్ (టిఆర్ఎస్)195 ఓట్లతో విజయం సాధించారు.

జేరిపోతుల రాంకుమార్ తిరుమలగిరి విలేకరి మరియు తుంగతుర్తి నియోజకవర్గం ఇన్చార్జి