సేవెన్ ఓక్స్ పెట్ హాస్పిటల్ 3వ బ్రాంచ్ మన వనస్థలిపురంలో ఘనంగా ప్రారంభం
ఎల్బీనగర్,1 మార్చి 2025 ఆదివారం తెలంగాణ వార్త రిపోర్ట్:రవికుమార్ : వనస్థలిపురం పనామా గోడౌన్స్ ఎదురుగా నూతనంగా ఏర్పాటు చేసిన సేవెన్ ఓక్స్ పెట్ హాస్పిటల్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా స్థానిక ఎల్.బి.నగర్ శాసనసభ్యులు శ్రీ దేవిరెడ్డి సుధీర్ రెడ్డి మరియు చేవెళ్ల మాజీ ఎంపీ డాక్టర్ రంజిత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆసుపత్రి నిర్వహకులు డాక్టర్ శ్రీరెడ్డి, డాక్టర్ సంధ్యారెడ్డి అతిథులను సాదరంగా ఆహ్వానించారు. కార్యక్రమంలో సరూర్‌నగర్ మాజీ ఎంపీపీ జిల్లెల కృష్ణారెడ్డి, గడ్డిఅన్నారం వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ వీరమళ్ల రామ్ నరసింహ గౌడ్, జక్కిడి రఘువీర్ రెడ్డి, ముద్ద పవన్, రవి ముదిరాజ్, ముద్ద కళ్యాణ్, యదాశంకర్ తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా నాయకులు ఆసుపత్రి సిబ్బందికి శుభాకాంక్షలు తెలియజేసి, పెంపుడు జంతువులకు ఆధునిక సదుపాయాలతో కూడిన మెరుగైన వైద్య సేవలు అందించాలని ఆకాంక్షించారు.