ఘోర రోడ్డు ప్రమాదం యువకుడు మృతి

Feb 28, 2026 - 20:14
 0  1195
ఘోర రోడ్డు ప్రమాదం యువకుడు మృతి

తిరుమలగిరి 28 ఫిబ్రవరి 2026 తెలంగాణ వార్త రిపోర్టర్

 సూర్యాపేట జిల్లా తిరుమలగిరి మండల కేంద్రంలోని ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది వివరాలకు వెళితే జాటోతు ప్రవీణ్ (32)అనే వ్యక్తి హైదరాబాదులో కారు డ్రైవర్ పని చేసుకుంటూ జీవన కొనసాగించేవాడు  పని ముగించుకొని  ఆయన స్వగ్రామమైన చారి తండా పడమటి గూడెం మండలం నరసింహుల గూడెం జిల్లా మహబూబాద్ జిల్లా కేంద్రంలోని భార్య పిల్లల వద్దకు వస్తుండగా మార్గమధ్యంలోని తిరుమలగిరి తహసిల్దార్ కార్యాలయం దాటిన తర్వాత ప్రమాదం చోటుచేసుకుంది స్థానికుల సమాచారం తో పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని మృతుని కుటుంబ సభ్యులకు ఫోన్ సమాచారం ద్వారా అందించారు మృతుడు వాడిన ద్విచక్ర వాహనం పూర్తిగా దగ్ధమైంది ఎవరైనా ఢీకొన్నారా లేకపోతే బైక్ స్కిడ్ అయి పడిపోయాడా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై వెంకట్ రెడ్డి తెలిపారు మృతునికి భార్య ఇద్దరు కుమారులు గలరు కేసు నమోదు చేసుకొని మృతున్ని మార్చురీ తుంగతుర్తి ఆసుపత్రి తరలించారు

జేరిపోతుల రాంకుమార్ తిరుమలగిరి విలేకరి మరియు తుంగతుర్తి నియోజకవర్గం ఇన్చార్జి