ప్రతి ఒక్కరూ రోడ్డు భద్రత చర్యలు పాటించాలి.... ఎం వి ఐ రాజ్ మహమ్మద్
మునగాల 09 జనవరి 2026 తెలంగాణ వార్త ప్రతినిధి:- రోడ్డుపై ప్రయాణించేటప్పుడు ప్రతి ఒక్కరు రోడ్డు భద్రతా నియమాలు పాటిస్తూ రోడ్డు ప్రమాదాల నివారణకు కృషి చేయాలని కోదాడ ఎంవిఐ రాజ మహమ్మద్, మునగాల సిఐ రామకృష్ణారెడ్డి అన్నారు, గురువారం మండల కేంద్రంలోని స్థానిక న్యూ ప్రజ్ఞా హై స్కూల్ నందు జాతీయ రోడ్డు భద్రత మాసత్సవాల సందర్భంగా పాఠశాల విద్యార్థులకు రోడ్డు భద్రత నియమా నిబంధనలపై అవగాహన సమావేశం నిర్వహించారు, ఈ కార్యక్రమానికి హాజరైన వారు మాట్లాడుతూ, ప్రతినిత్యం రోడ్డుపై ప్రయాణించే ప్రయాణికులు మరియు వాహనదారులు ప్రమాదాల బారిన పడుతూ విలువైన తమ ప్రాణాలను పోగొట్టుకోవటమే కాకుండా తమను నమ్ముకున్న తమ కుటుంబాల భవిష్యత్తును కూడా నాశనం చేస్తున్నారని, అదేవిధంగా ఎంతోమంది వివిధ ప్రమాదాలలో అంగవైకల్యానికి గురై జీవితాంతం నరకయాతన అనుభవిస్తూ వారి కుటుంబాలను పోషించుకోవడానికి కూడా సమస్యలు ఎదుర్కోవాల్సిన పరిస్థితి దాపరిస్తుందని, కావున పాఠశాల దశ నుండి విద్యార్థులు రోడ్డు భద్రత నియమ నిబంధనలపై అవగాహన కలిగి ఉండాలన్న ఆలోచనతో రాష్ట్ర ప్రభుత్వం జాతీయ రోడ్డు భద్రత మాసోత్సవాల సందర్భంగా ప్రతి పాఠశాలలో విద్యార్థినివిద్యార్థులకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహిస్తుందని వారు తెలిపారు, అదేవిధంగా పాఠశాలలో విద్యను అభ్యసించే విద్యార్థులు తమ ఇంటి వద్ద తమ కుటుంబ సభ్యులకు రోడ్డు భద్రత చర్యల గురించి, తెలియజేయాలని వారు తెలిపారు, ప్రధానంగా రోడ్డు భద్రత నియమ నిబంధనలు పాటించకపోవడం, మైనర్లకు వాహనాలు ఇవ్వడం, అధిక వేగం, మద్యం సేవించి వాహనాలు నడపడం, హెల్మెట్ సీటు బెల్టు ధరించకపోవడం ప్రమాదాలకు ప్రధాన కారణమని, కావున ప్రతి ఒక్కరు విధిగా రోడ్డు భద్రత నియమ నిబంధనలను తూచ తప్పకుండా పాటిస్తూ, హెల్మెట్ ,సీటు బెల్టు ధరించి వాహనాలు నడుపుతూ, మద్యం సేవించి వాహనాలు నడపకుండా వేగ నియంత్రణ పాటిస్తూ ప్రమాదాల నివారణకు కృషి చేయాలని వారు తెలిపారు, అనంతరం విద్యార్థులతో రోడ్డు భద్రతా నియమాలు పాటిస్తామని ప్రతిజ్ఞ చేయించారు, ఈ కార్యక్రమంలో మునగాల ఎస్ఐ ప్రవీణ్ కుమార్, నడిగూడెం ఎస్సై అజయ్ కుమార్, మోతే ఎస్సై అజయ్, నూ ప్రజ్ఞా హైస్కూల్ కరస్పాండెంట్ కాచాని కృష్ణమూర్తి, పాఠశాల ఉపాధ్యాయ బృందం మరియు విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.