జిల్లా కేంద్రంలో విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు

Feb 27, 2026 - 22:10
Feb 27, 2026 - 22:12
 0  1
జిల్లా కేంద్రంలో విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు

సూర్యాపేట పట్టణ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్...


సూర్యాపేట 27 ఫిబ్రవరి 2026 తెలంగాణ వార్త ప్రతినిధి. సూర్యాపేట పట్టన్లో లో మైనర్ డ్రైవింగ్ పై స్పెషల్ ఫోకస్ పెట్టడం జరిగిందని ట్రాఫిక్ ఎస్సై సాయిరాం తెలిపారు. అరైవ్ ఆలైవ్ రోడ్డు భద్రత అవగాహన కార్యక్రమాలలో భాగంగా జిల్లా కేంద్రంలో విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తూ రోడ్డు నియమ నిబంధన పట్ల ప్రజలను చైతన్యవంతం చేస్తున్నామని అన్నారు. రోడ్డు భద్రత అవగాహన కార్యక్రమాలలో భాగంగా జిల్లా ఎస్పీ నర్సింహ ఆదేశాల మేరకు ఈరోజు మండల పరిధిలో మైనర్ డ్రైవింగ్ చిన్న పిల్లలు వాహనాలు తొలకంపై స్పెషల్ డ్రైవ్ నిర్వహించడం జరిగిందని తెలిపారు. పిల్లలకు వాహనాలు ఇవ్వడం తల్లిదండ్రులు చేసే నేరమని, పిల్లలురోడ్డు ప్రమాదాలకు గురైనా, కారనమైనా తల్లిదండ్రులపై చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించారు. వాహనాలు ఇస్తే పిల్లల్లా సరదా కాస్త విషాదమవుతుందని సూచించారు. అనేకచోట్ల మైనర్ డ్రైవింగ్ వల్ల రోడ్డు ప్రమాదాలు నమోదు అవుతూ చాలామంది పిల్లలు మృత్యువాత పడుతున్నారని వికలాంగులుగా అవుతున్నారని గుర్తు చేశారు. కావున తల్లిదండ్రులు పిల్లల పట్ల శ్రద్ధగా ఉండాలని ఎట్టి పరిస్థితుల్లో వారికి వాహనాలు ఇవ్వకూడదని కోరారు. మండల వ్యాప్తంగా మైనర్ డ్రైవింగ్ పై ప్రతిరోజు తనిఖీలు నిర్వహిస్తామని ఎవరైనా మైనర్ డ్రైవింగ్ చేస్తూ దొరికినట్లైతే అలాంటి వారిపై మరియు ప్రోత్సహిస్తున్న వాహన యజమానిపై కేసు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333