మహిళలను చిన్న పిల్లలను వేధిస్తే అప్పటికప్పుడే ఎఫ్ఐఆర్

ఎస్సై వెంకట్ రెడ్డి

Mar 1, 2026 - 19:40
Mar 1, 2026 - 19:41
 0  0
మహిళలను చిన్న పిల్లలను వేధిస్తే అప్పటికప్పుడే ఎఫ్ఐఆర్

 అడ్డగూడూరు1 మార్చి 2026 తెలంగాణవార్త రిపోర్టర్:– తెలంగాణ పోలీసు శాఖ ప్రజలకు మరింత వేగంగా మరియు పారదర్శకంగా సేవలు అందించడానికి ప్రవేశపెట్టిన కీలకమైన సంస్కరణ అయిన "ఆన్-సైట్ ఎఫ్ఐఆర్ అండ్ సి ని ఉన్నత అధికారుల ఆదేశాల మేరకు ఆదివారం అడ్డగూడూరు పోలీస్ వారు తమకు వచ్చిన 100 కాల్ లో బొడ్డుగూడెం గ్రామానికి చెందిన పిర్యాది కురిమిల్ల ఉమా భర్త రాజ్ కుమార్ తనను తన అత్త పద్మ,మామ సోమయ్య శారీరకంగా వేధిస్తున్నారని అలాగే ఈ రోజు మధ్యాహ్నం తన ఇంట్లోకి వచ్చి చేయి చేసుకున్నారని చెప్పగా వెంటనే స్థానిక ఎస్సై వెంకట్ రెడ్డి&బ్లూ కోల్ట్స్ కానిస్టేబుల్స్ శ్రీనివాస్, రాజశేఖరరెడ్డి ఇంటి వద్దకు వచ్చి జరిగిన విషయం తెలుసుకొని పిర్యాది దారుల నుండి పిర్యాదు తీసుకోని అక్కడికక్కడే(అన్ సీట్ ఎఫ్ఐఆర్)చేసి పిర్యాదు రాలికి అందచేసి ఇన్వెస్టిగేషన్ ప్రారంభించినారు.ఎస్సై అడ్డగూడూరు మండలం లో మహిళలు , చిన్నపిల్లలు వంటి వారి పై ఏదైనా నేరాలు జరిగినట్లయితే వెంటనే 100కి డయల్ చేసినట్లయితే పోలీసు వారు సత్వరం స్పందించి అక్కడికక్కడే ఎఫ్ఐఆర్ చేస్తారని ఎస్సై వెంకట్ రెడ్డి తెలిపారు.