ప్రజా పాలన సంక్షేమ పథకాల పంపిణి

అడ్డగూడూరు మండలంలో పైలెట్ ప్రాజెక్ట్ గ్రామంగా మానాయకుంట
అడ్డగూడూరు 27 జనవరి 2025 తెలంగాణవార్త రిపోర్టర్:- కాంగ్రెస్ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టత్మాకంగా ప్రవేశం పెట్టిన ఆర్ గ్యారంటీలలో భాగంగా 76వ గణతంత్ర దినోత్సవ సందర్భంగా నాలుగు నూతన పథకాలు ప్రవేశపెట్టారు. అందులో రైతు భరోసా,ఇందిరమ్మ ఆత్మీయ భరోసా,ఇందిరమ్మ ఇండ్లు, అందరికీ రేషన్ కార్డులు సంక్షేమ పథకాలు అడ్డగూడూరు మండలం మానాయకుంట గ్రామాన్ని పైలెట్ ప్రాజెక్టు గ్రామంగా ఎంపిక కావడం జరిగింది.సంక్షేమ పథకాలకు ఎంపికైన అర్హులైన ప్రజలకు ప్రోసిడింగ్ పత్రాలను మండల ఎమ్మార్వో శేషగిరిరావు మండల స్పెషల్ అధికారి కృష్ణ చేతులమీదుగా అందించడం జరిగింది. రైతు భరోసాకు 484 మంది, ఇందిరమ్మ ఇళ్లకు 83 మంది, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కు 16 మంది, రేషన్ కార్డులకు 102 మంది, ఎంపికైనట్లుగా ప్రకటించడం జరిగింది. ఇట్టి పథకాలకు అర్హులైన ఎంపికైన ప్రజలు సంతోషాన్ని వ్యక్తం చేస్తూ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో మండల స్పెషల్ అధికారి కృష్ణ, ఎంపీడీవో శంకరయ్య,ఎంపీ ఓ ప్రేమలత,డిప్యూటీ ఎమ్మార్వో సత్యనారాయణ,పంచాయతీ సెక్రటరీలు గ్రామ సిబ్బంది గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.