ఎస్సార్ ప్రైమ్ స్కూల్లో ఘనంగా జాతీయ సైన్స్ దినోత్సవ వేడుకలు
కోదాడ ఫిబ్రవరి 28,ధర్మఘంట : ఎస్సార్ ప్రైమ్ స్కూల్లో జోనల్ ఇన్చార్జి స్నేహలత ఆధ్వర్యంలో జాతీయ సైన్స్ దినోత్సవ వేడుకలను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో స్నేహలత మాట్లాడుతూ నిత్యజీవితంలో ప్రతి అంశం సైన్స్ మీద ఆధారపడి ఉంటుందని అన్నారు. ప్రతి అంశాన్ని పరిశీలిన దృష్టితో చూడటం ఎంతో అవసరము అన్నారు. ప్రిన్సిపల్ పుల్లయ్య మాట్లాడుతూ ప్రతి విద్యార్థి నైపుణ్యతను గుర్తించటం ఎంతో అవసరం అన్నారు.ప్రతి విషయం తెలుసుకోవటమే సైన్స్ అన్నారు. విద్యార్థులు బాగా చదువుకొని ఉన్నత స్థాయికి ఎదగాలని కోరుకున్నారు. విద్యార్థి దశ నుండే ప్రతి అంశం ఏమిటి, ఎలా, ఎందుకు అనే దృష్టితో చూడటం ఎంతో అవసరం అన్నారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు చేసిన ప్రాజెక్టును పరిశీలించి గెలుపొందిన వారికి, బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయుని,
ఉపాధ్యాయులు విద్యార్థిని, విద్యార్థులు, విద్యార్థుల తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.