సూర్యాపేట జిల్లాకు ధర్మ బిక్షం పేరు పెట్టాలి

Feb 16, 2026 - 12:22
Feb 16, 2026 - 12:25
 0  3
సూర్యాపేట జిల్లాకు ధర్మ బిక్షం పేరు పెట్టాలి

హైదరాబాద్ ట్యాంక్ బండి పై ఆయన కాస్య విగ్రహం ఏర్పాటు చేయాలి

సిపిఐ జిల్లా కార్యదర్శి విజయవాడ వెంకటేశ్వర్లు

సూర్యాపేట తొలి శాసనసభ్యుడిగా స్వతంత్ర సమరయోధుడు తెలంగాణ రైతాంగ సాయిధ పోరాట యోధులు మాజీ ఎంపీ బొమ్మగాని ధర్మభిక్షం పేరుని సూర్యాపేట జిల్లాకు నామకరణం చేయాలని సిపిఐ జిల్లా కార్యదర్శి బెజవాడ వెంకటేశ్వర్లు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆదివారం జిల్లా కేంద్రంలో ధర్మభిక్షం భవనంలో పట్టణ కార్యదర్శి బూర వెంకటేశ్వర్లు అధ్యక్షతన జరిగిన 104వ జయంతి ఉత్సవాలు సందర్భంగా ఆయన ఫోటోకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సూర్యాపేట పట్టణ తొలి హాస్టల్ నిర్మించి విద్యార్థులను విద్యాబుద్ధుల నేర్పించి చైతన్యవంతులను చేసి అనేక రంగాలలో తీర్చిదిద్దిన మహా నాయకుడు అని అన్నారు. జిల్లాకు పరిశ్రమల ఏర్పాటు చేసి యువకులకు ఉద్యోగాలు అవకాశాలు కల్పించాలని మరియు సాగు త్రాగునీరు గురించి అనేక పోరాటాలు నిర్వహించి సాధించిన మహా నాయకుడు అన్నారు. దళిత పీడిత బడుగు బలహీన వర్గాల హక్కులను సాధించే విధంగా పోరాడిన ప్రజల నాయకుడు బొమ్మగాని ధర్మ బిక్షం అని కీర్తించారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి వారి జయంతిని, వర్ధంతిని ప్రభుత్వ నిర్వహించి, హైదరాబాద్ ట్యాంకు బండి పై కాస్య విగ్రహం ఏర్పాటు చేయాలని, మహా నాయకుని జీవిత చరిత్రను ముందు తరానికి తెలిసే విధంగా పాఠ్య పుస్తకాలలో వచ్చే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ధర్మబిక్షం ఆశయాలను ముందు తీసుకెళ్లడమే ఆయనకు మనం ఇచ్చే నిజమైన ఘన నివాళి అని అన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఐ సీనియర్ నాయకులు బొమ్మగాని శ్రీనివాస్, దంతాల రాంబాబు, చామల అశోక్ కుమార్, దోరేపల్లి శంకర్, సీనియర్ జర్నలిస్ట్ డేగల జనార్ధన్, పబ్లిక్ ప్రాసిక్యూటర్ నాతి సవేందర్ కుమార్, మాజీ కౌన్సిలర్ అనంతల మల్లేశ్వరి, చివ్వెంల మండల కార్యదర్శి ఖమ్మంపాటి రాము, సీనియర్ అడ్వకేట్ తలమల్ల హస్సేన్, శాంతి సంఘం జిల్లా అధ్యక్షులు తొగటి మురళి, గుగులోతు రాజారాం, యూత్ నాయకులు బూర సైదులు, ఎడెల్లి శ్రీకాంత్, మహిళ నాయకురాలు దంతాల పద్మ రేఖ, దేశ గాని హేమలత, రిక్షా యూనియన్ నాయకులు పెన్డ్రా కృష్ణ వాడపల్లి వెంకన్న, బాబు తదితరులు పాల్గొన్నారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333