అనాజి పురం ఆదర్శ పాఠశాలలో విద్యార్థి పాత్ర పై అవగాహన కార్యక్రమం

అనాజ్ పురం ఆదర్ష పాఠశాలలో విద్యార్థి పాత్ర పై అవగాహన కార్యక్రమం
సూర్యాపేట :ఆగస్టు 29 తెలంగాణ ప్రభుత్వ ఆదర్శ పాఠశాల అనాజిపురం ప నందు బాల రక్ష భవన్ జిల్లా బాలల పరిరక్షణ విభాగం ఆధ్వర్యంలో పాఠశాల బాలికలకు విద్యార్థి దశలో ఆలోచన విధానం విద్యార్థి పాత్ర పై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ కార్యక్రమంలో జిల్లా బాలల పరిరక్షణ విభాగo ప్రొటక్షన్ అధికారి షేక్. మీరా పాల్గొని మాట్లాడుతూ సమాజంలో ప్రతి విద్యార్థి ఆలోచన విధానంలో మార్పు రావాలని ప్రతిఒక్కరు భవిష్యత్తుపై ఉన్నత లక్ష్యంతో చదువుకోవాలని , ప్రతి ఒక్కరు సమాజంలో ఉన్నత స్థాయిలో ఉండే విధంగా భవిష్యత్తు కార్యాచరణ చేసుకోవాలని అన్నారు.తల్లిదండ్రులు తమ పిల్లల మీద పెట్టుకున్న ఆశలు, నమ్మకాన్ని ,భవిష్యత్తు లక్ష్యాన్ని సాధించేందుకు పిల్లలు ఇష్టం తో కష్టపడి చదువుతూ మంచి పేరు తేవాలని అప్పుడు మాత్రమే తల్లిదండ్రుల పట్ల పిల్లల బాధ్యత పూర్తిస్థాయిలో నిర్వహించినట్టు అవుతుంది అని తెలిపారు. పాఠశాల దశలో విద్యార్థి పూర్తిస్థాయిలో అన్ని అంశాలపై అవగాహన కలిగి ఉండాలని, సమాజం లో ప్రస్తుతం ఉన్న పరిస్థితులు గురించి ఆలోచన చేసి నిర్ణయాలు తీసుకోవాలని అన్నారు. ఆదర్శ పాఠశాల ఇన్చార్జి ప్రిన్సిపల్ ఏస్. కె.సలీం మాట్లాడుతూ ఈ పాఠశాల దశలో పిల్లలు తీసుకునే నిర్ణయాలే వారి జీవితానికి పునాదుల్లా ఉంటాయని తెలిపినారు . మంచి స్నేహాలు మాత్రమే చేయాలని చేడు స్నేహాలకు దూరంగా ఉండాలని మరియు పెద్దల మీద గౌరవం ఉండాలని ప్రతి ఒక్కరికి విధేయులుగా ఉండాలని చెప్పినారు. బాల రక్ష భవన్ అధికారి శ్రీలక్ష్మి గారు మాట్లాడుతూ ప్రతి విద్యార్థి కూడా గ్రామస్థాయి నుండి నిరుపేద కుటుంబం నుంచి వచ్చిన వారే కాబట్టి బాగా చదువులో రాణించి తల్లిదండ్రులకు, గురువులకు పేరు తీసుకు రావాలని కోరారు. విద్యార్థినులకు సేఫ్ టచ్ - అన్ సేఫ్ టచ్ గురించి వివరించారు చైల్డ్ లైన్ టీం మెంబర్ డి.కిరణ్, child help line toll free No. 1098,గురించి వివరించడo జరిగింది.ఈ కార్యక్రమంలో ఆదర్శ పాఠశాల ఇన్చార్జి ఏస్. కే.సలీం ఉపాధ్యాయులు బిఎస్ గౌడ్, అమర్ కుమార్,కృష్ణప్రియ, స్వాతి, వేను,రమేష్,నాగ లక్ష్మి,నయీం,వెంకటరెడ్డి,కేశవులు, శాంతిప్రియా మరియు బాల రక్ష భవన్ అధికారులు Sk.మీరా, V.V.శ్రీలక్ష్మి మరియు పిల్లలు పాల్గొనడం జరిగింది.