PDSU అర్థ శతాబ్ద వారోత్సవాలు
అక్టోబర్ 20న సూర్యాపేట లో PDSU అర్థ శతాబ్ద వారోత్సవాల సందర్బంగా PDSU పూర్వ, ప్రస్తుత విద్యార్థుల కలియిక సభను జయప్రదం చేయండి
తెలంగాణ వార్త సూర్యాపేట జిల్లా ప్రతినిధి:- అక్టోబర్ 20 సూర్యాపేట లోని లక్ష్మి గార్డెన్స్ లో,అక్టోబర్ 24న ఉస్మానియా యూనివర్సిటీ ఠాగూర్ ఆడిటోరియంలో PDSU అర్థ శతాబ్దొత్సవాల సభలను PDSU ప్రస్తుత పూర్వ విద్యార్థులు మేధావులు విద్యావంతులు పాల్గొని జయప్రదం చేయాలని సూర్యాపేట జిల్లా కేంద్రంలోని కామ్రేడ్ చండ్ర పుల్లా రెడ్డి విజ్ఞాన కేంద్రంలో జరిగిన సమావేశంలో *PDSU వ్యవస్థాపక సభ్యులు డాక్టర్ రంగారెడ్డి పాల్గొని* మాట్లాడుతూ నక్సల్స్బరి, శ్రీకాకుళం, గోదావరిలోయ ప్రతిఘటన పోరాటాల ప్రేరణతో 1972 లో ఉస్మానియా యూనివర్సిటీ లో విప్లవ విద్యార్థి నాయకుడు జార్జిరెడ్డి నేతృత్వంలో PDS పురుడుపోసుకొని 1974 అక్టోబర్ 11,12 లో జె.సి.ఎస్ ప్రసాద్ నాయకత్వం లో PDSU గా ఆర్భవించి నేటికి 50 వసంతాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా PDSU పూర్వ &ప్రస్తుత విద్యార్థుల ఆధ్వర్యంలో అక్టోబర్ 20న ఆదివారం 2 గంటలకు లక్ష్మీ గార్డెన్స్ సూర్యాపేటలో , 24 న హైదరాబాదు ఉస్మానియా యూనివర్సిటీ ఆడిటోరియం కేంద్రంలో అర్ధ శతాబ్దోత్సవ సభలను జరుపుతున్నామని ఈ సభలను ప్రజాస్వామికవాదులు పూర్వ విద్యార్థులు ప్రస్తుత విద్యార్థులు పాల్గొని జయప్రదం చేయాలని వారు అన్నారు. *PDSU పూర్వ విద్యార్థులు అడ్వకేట్స్ లింగంపల్లి భద్రయ్య, కుంట్ల ధర్మార్జున్, ముప్పాని కృష్ణారెడ్డి, రాచురి ప్రతాప్, నారబోయిన వెంకట్, sk సుభాని, గంట నాగయ్య, కునుకుంట్ల సైదులు, PDSU రాష్ట్ర ఉపాధ్యక్షులు పోలేబోయిన కిరణ్, జిల్లా అధ్యక్షులు పుల్లూరి సింహద్రి, సామా నర్సిరెడ్డి* తదితరులు పాల్గొన్నారు.