45 లక్షల రూపాయల సిసి రోడ్లకు భూమి పూజా:జెడ్పి చైర్ పర్సన్ సరిత
జోగులాంబ గద్వాల ఫిబ్రవరి 2024 తెలంగాణ వార్తా ప్రతినిధి:- మల్దకల్ . మండల పరిధిలోని ఎల్కూర్ గ్రామంలో జిల్లా పరిషత్ చైర్ పర్సన్ సరిత సహకారంతో మహాత్మ గాంధీ ఉపాధి హామీ పథకం క్రింద 45 లక్షల రూపాయల నిధులతో గ్రామంలో పలు వీధులలో సిసి రోడ్లు పనులకు జెడ్పి చైర్ పర్సన్ సరిత చేతులమీదుగా పనులను శనివారం ప్రారంభించారు..
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ...గ్రామంలో సరైన రోడ్లు లేకపోవడంతో పురవీధులలో మురుగునీటి సమస్యతో బాధపడుతున్న విషయం తన దృష్టికి తీసుకు రావడంతో సమస్య పరిష్కారానికి కృషి చేస్తు జెడ్పి చైర్ పర్సన్ సరిత సిసి రోడ్లు పనులకు శ్రీకారం చుట్టి నట్లు తెలిపారు.గద్వాల నియోజకవర్గంలోని ప్రతి గ్రామ అభివృద్ధి కోసం కాంగ్రెస్ ప్రభుత్వం తరపున కృషి చేస్తానన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.