ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రజలకు అందేలా చూడాలి. ఎమ్మార్వో ధరావత్ లాల్ నాయక్

ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రజలకు అందేలా చూడాలి. ఎమ్మార్వో ధరావత్ లాల్ నాయక్
తెలంగాణ వార్త పెన్ పహాడ్ ఫిబ్రవరి 21 ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హత కలిగిన మండల ప్రజలందరికీ అందేలా చూడాలని తాహాసీల్దార్ ధరావత్ లాలు నాయక్ తెలిపారు. రెవెన్యూ కార్యాలయంలో శుక్రవారం జరిగిన వివిధ శాఖల అధికారులతో మండల అభివృద్ధి పై. జరిగిన సమీక్ష సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. వేసవి కాలం సమీపించి నందున ఏలాంటి నీటి కొరత లేకుండా చూడాలన్నారు. విద్యుత్ అంతరయం లేకుండా చూడాలన్నారు. అర్హత కలిగిన వారికి రేషన్ కార్డులు. రైతు భరోసా. ఇందిరమ్మ ఇండ్లు. అందేలా చూడాలన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలపై దరఖాస్తులు పెట్టుకున్న వారిపై గ్రామాల్లోకి వెళ్లి సమగ్ర విచారణ జరిపి అర్హత కలిగిన వారికి న్యాయం చేసే విధంగా వివిధ శాఖల అధికారులు సహకరించాలన్నారు. ఈ కార్యక్రమంలో.ఎంపీడీవో వెంకటేశ్వరరావు. ఆర్ డబ్ల్యూ ఎస్ ఏ ఈ శ్రీనివాస్. ఎస్సై గోపికృష్ణ.. ఎస్ ఆర్ ఎస్ పి అధికారి సుజాత. ఏపీఎం అజయ్ నాయక్. ఏపీఓ రవి. విద్యుత్ అధికారి శ్రీనివాస్. అంగన్వాడి సూపర్వైజర్ హసీనా.. పాల్గొన్నారు.