త్వరలోఆర్టీసీ బస్సుల్లో డిజిటల్ సేవలు?
హైదరాబాద్:జూన్ 26:- తెలంగాణ లో త్వరలోఆర్టీసీ డిజిటల్లోకి అడుగుపెట్ట బోతోంది. ఆర్టీసీ బస్సుల్లో ఇక నుంచి చిల్లర కోసం తిప్పలు పడాల్సిన అవసరం ఉండదు.
ఎందుకంటే మరికొన్ని రోజుల్లోనే ఆర్టీసీ బస్సుల్లో డిజిటల్ సేవలను అందుబా టులోకి తీసుకువచ్చేందుకు ప్రక్రియను స్పీడప్ చేసింది. ఆర్టీసీ.
ఆర్టీసీ బస్సుల్లోనూ గూగుల్ పే, ఫోన్ పే, డెబిట్, క్రెడిట్, పేటీఎం వంటి స్వైపింగ్ పేమెంట్స్ విధానాలతో టికెట్లను జారీ చేయను న్నారు.
సాధారణంగా బస్సు టికెట్ల జారీలో చిల్లర భయం ఉంటుంది. ఈ విషయంలో కండక్టర్లు నానా తిప్పలు పడుతుంటారు. ఇలాంటి పరిస్థితుల్లో ఆన్ లైన్ చెల్లింపులను ప్రోత్సహించి టికెట్ జారీ చేయడానికి గ్రేటర్ ఆర్టీసీ అధికారులు కసరత్తు షురూ చేశారు.