టిఎం జె ఎఫ్ మండల అధ్యక్షుడిగా జేరిపోతుల రాoకుమార్

తిరుమలగిరి 08 ఆగస్టు 2025 తెలంగాణ వార్త రిపోర్టర్
జర్నలిస్టు రంగంలో ఎదుర్కొంటున్న సమస్యలపై ఎప్పటికప్పుడు ఉద్యమాల ద్వారా రావలసిన హక్కులకై కొట్లాడుతున్న (టీఎంజెఎఫ్) తెలంగాణ మాదిగ జర్నలిస్ట్ ఫోరం పోరాటాలు చేస్తున్నది.ఆ సంఘ తిరుమలగిరి మున్సిపాలిటీ,మండల అధ్యక్షుడిగా జేరిపోతుల రాంకుమార్ తెలంగాణ వార్త రిపోర్టర్ మరియు తుంగతుర్తి నియోజకవర్గ ఇన్చార్జి ని నియమించడం జరిగిందని టీఎంజెఎఫ్ రాష్ట్ర నాయకులు చింత ప్రవీణ్ ఓ ప్రకటనలో తెలిపారు.ఈ సందర్భంగా తన నియమకానికి కృషి చేసిన రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు బూర్గుల నాగేందర్ కు,రాష్ట్ర కమిటీ సభ్యులకు జేరుపోతుల రామ్ కుమార్ కృతజ్ఞతలు తెలియజేశారు.నాపై నమ్మకంతో బాధ్యతను అప్పగించినందుకు జర్నలిస్టులకు ఎదురయ్యే సమస్యలపై రాష్ట్ర కమిటీ ఆదేశాలనుసారం తన వంతు సహకారంతో ఉద్యమిస్తానని రామ్ కుమార్ తెలిపారు.