పెండింగ్ లో ఉన్న బిల్లులు వేతనాలు వెంటనే విడుదల చేయండి. సీఐటీయు. 

Aug 6, 2025 - 20:25
 0  6
పెండింగ్ లో ఉన్న బిల్లులు వేతనాలు వెంటనే విడుదల చేయండి. సీఐటీయు. 
పెండింగ్ లో ఉన్న బిల్లులు వేతనాలు వెంటనే విడుదల చేయండి. సీఐటీయు. 

 జోగులాంబ గద్వాల 6 ఆగస్టు 2025 తెలంగాణ వార్తా ప్రతినిధి : * గద్వాల మధ్యాహ్నం భోజనం వర్కర్లకు పెండింగ్లో ఉన్న వేతనాలు బిల్లులను వెంటనే విడుదల చేయాలని సీఐటీయు జిల్లా ప్రధాన కార్యదర్శి వి.వి. నరసింహ డిమాండ్ చేశారు. బుధవారం జిల్లా కేంద్రంలోని డీఈఓ కార్యాలయంలో వేతనాల విడుదలపై  deo వినతి పత్రం  సమర్పించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ  మధ్యాహ్న భోజన కార్మికులకు ఆరు నెలల నుండి  వేతనాలు, సంవత్సరం నుండి గుడ్డు బిల్లులు బిల్లులు పెండింగ్లో ఉన్నాయని అన్నారు. కేంద్ర ప్రభుత్వం మధ్యాహ్న భోజన పథకంలో తన వాటాను ఇవ్వడంలేదని దీనివల్ల బిల్లుల చెల్లింపులో మరింత ఆలస్యం అవుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం బిల్లుల మంజూరు చేయకపోవడం వల్ల  కార్మికులు అప్పులు తెచ్చి తమ ఇంటిని పోషించుకోవడంతోపాటు,విద్యార్థులను పోషించాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. ఇచ్చే గౌరవ వేతనాలు కూడా సక్రమంగా అందజేయడం లేదని అన్నారు. ఎన్నికల హామీలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం పదివేల వేతనం మధ్యాహ్న భోజన కార్మికులకు ఇస్తానని హామీ ఇచ్చిందని కానీ హామీని నేటికీ అమలు చేయలేదని విమర్శించారు. ప్రభుత్వాన్ని ఇస్తున్న నిధులకు పెరుగుతున్న నిత్యావసర ధరలకు  పొంతన లేకుండా ఉందని, పెరిగే ధరలకు అనుగుణంగా పిల్లలకు ఇచ్చే మెనూ చార్జీలను, మధ్యాహ్న భోజనం కార్మికులకు ఇచ్చే వేతనాలను  ఎందుకు పెంచడం లేదని ప్రశ్నించారు. ఒకవైపు వేతనాలు విడుదల చేయకుండా బిల్లులు చెల్లించకుండా మరోవైపు మధ్యాహ్న భోజన పథకాన్ని స్వచ్ఛంద సంస్థలకు ఇచ్చే నిర్ణయాన్ని తీసుకోవడం దుర్మార్గమన్నారు. మధ్యాహ్న భోజన పథకాన్ని స్వచ్ఛంద సంస్థల అప్పగిస్తే విద్యార్థుల కు అందించే భోజనం లో నాణ్యత ఉండదని పౌష్టికాహారం లోపిస్తుందని అన్నారు. దశాబ్దంగా విద్యార్థులకు సేవలు అందిస్తున్న మధ్యాహ్న భోజన కార్మికులకు కాదని ప్రైవేటు సంస్థలకు అప్పజెప్పడం తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో వచ్చినవి ప్రకారం 10,000 వేతనం అమలు చేయాలని ప్రతి స్కూలుకు గ్యాస్ సిలిండర్లు ఇవ్వాలని అవసరమైన గ్యాస్ ను సరఫరా చేయాలని గుర్తింపు కార్డులను ప్రభుత్వం ఇవ్వాలని సామాజిక బాధ్యత కల్పించి కార్మికులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. కాబట్టి ప్రభుత్వం తక్షణమే మెనూ చార్జీలను పెంచి కార్మికులకు పెండింగ్లో ఉన్న బిల్లులు జీతాలను వెంటనే విడుదల చేసి కార్మిక వ్యక్తిగత ఘాతాల్లోనే వేయాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా ఉపాధ్యక్షుడు ఉప్పేర్ నరసింహ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయిస్ యూనియన్ జిల్లా అధ్యక్షులు గట్టన్న తెలంగాణ మధ్యాహ్న భోజన పథకం కార్మికుల యూనియన్ సీఐటీయు అనుబంధం నాయకులు మల్లీశ్వరి కార్మికులు రాధమ్మ, వీరేషమ్మ, శేషమ్మ, శైలజ, పరిమళ, పద్మ, లక్ష్మమ్మ, అడివమ్మ, గోవిందమ్మ తదితరులు పాల్గొన్నారు.

GireeshKumar Ekalavya విలేకరులు కావలెను No డిపాజిట్..! No టార్గెట్..! న్యూస్ లు మీవి ...! పబ్లిష్ మాది ..! చేయవాల్సిందల్లా ఒక్కటే న్యూస్ సేకరించడం. ఆ న్యూస్ ను పబ్లిక్ లోకి తీసుకపోవడం ప్రముఖ మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి న్యూస్ ఛానల్, పేపర్, వెబ్సైట్ చూసుకుంటుంది. మా న్యూస్ ఛానల్ నందు పనిచేయుటకు మండలాల వారిగా విలేకరులు కావలెను. సంప్రదించవలసిన నెంబర్ 9063881333