చాలి చాలని జీతాలతో పని భారంతో ఫిల్డ్ అసిస్టెంట్

తెలంగాణ వార్త ఆత్మకూరు ఎస్ గ్రామస్థాయిలో పని భారం ఎక్కువైనా తక్కువ వేతనంతో పని చేస్తున్నటువంటి ఫీల్డ్ అసిస్టెంట్లకు నెల నెల వేతనాలు చెల్లించకపోవడం వలన కుటుంబ పోషణ భారమై ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. కాబట్టి జిల్లా కమిటీ నిర్ణయం మేరకు మండలంలో జరిగే రివ్యూ మీటింగ్ ను బహిష్కరిస్తూ ఎంపీడీవో గారికి మెమోరాండం సమర్పిస్తూ పెండింగ్ వేతనాలు వెంటనే ఇప్పించాల్సిందిగా కోరనైనది. ఈ కార్యక్రమంలో అధ్యక్షుడు తడకమల్ల శేఖర్ ,గౌరవ సలహాదారు కొరివి అంజయ్య, ఉపాధ్యక్షులు పరమేష్,అంజమ్మ, లక్ష్మమ్మ,శంకర్, శ్రీనివాస్,నాగమణి, చంద్రకళ,అంజయ్య, శోభ,లింగయ్య,విమలత తదితరులు పాల్గొన్నారు