ఆత్మకూరు (ఎస్) మండలంలో దారుణం తల్లి అంత్యక్రియలు నిలిపివేత

Oct 16, 2025 - 23:48
Oct 17, 2025 - 18:45
 0  1
ఆత్మకూరు (ఎస్) మండలంలో దారుణం తల్లి అంత్యక్రియలు నిలిపివేత

తెలంగాణ వార్త ఆత్మకూరు ఎస్  ఆత్మకూరు (ఎస్) మండలంలో దారుణం తల్లి అంత్యక్రియలు నిలిపివేత* ఆత్మకూరు ఎస్ మండల కేంద్రానికి చెందిన పొదిల నరసమ్మ మృతి చెందింది. నరసమ్మకి ఇద్దరు కూతుళ్లు - పెద్ద కూతురు వెంకటమ్మ, చిన్న కూతురు కళమ్మ. కుటుంబంలో ఉన్న ఆస్తిలో ఇద్దరికి వాటాలు పంచి, కొంత ఆస్తి డబ్బు మరియు బంగారం తన దగ్గరే ఉంచుకుంది నరసమ్మ. అనారోగ్యంతో బాధపడుతుండటంతో ఆ డబ్బు, బంగారం మొత్తాన్ని చిన్న కూతురు వద్ద భద్రపరిచింది. మూడు రోజుల కిందట నరసమ్మ మృతి చెందింది. తల్లి వద్ద ఉన్న నిల్వ డబ్బుతో అంత్యక్రియలు చేయాలని పెద్ద కూతురు వెంకటమ్మ అడిగింది. కానీ ఆ డబ్బు, బంగారం విషయమై తేడాలు తలెత్తడంతో చిన్న కూతురు కళమ్మ అంత్యక్రియలకు హాజరుకాలేదు. చెల్లెలు రాకుండా తండ్రి లేకుండా అంత్యక్రియలు చేస్తే తనపై నిందలు వస్తాయని వెంకటమ్మ ఆందోళన వ్యక్తం చేసింది.