విద్యార్థులకు స్టడీ మెటీరియల్,ప్యాడ్లు పంపిణీ చేస్తున్న మేడి ఫౌండేషన్ చైర్మన్ మేడి కృష్ణ

Mar 17, 2024 - 20:49
 0  8
విద్యార్థులకు స్టడీ మెటీరియల్,ప్యాడ్లు పంపిణీ చేస్తున్న  మేడి ఫౌండేషన్ చైర్మన్ మేడి కృష్ణ

తెలంగాణ వార్త ఆత్మకూరు యస్ విద్యార్థులకు స్టడీ మెటీరియల్,ప్యాడ్లు పంపిణీ చేస్తున్న మేడి ఫౌండేషన్ చైర్మన్ మేడి కృష్ణ . ఆత్మకూరు ఎస్ మండల కేంద్రంలోని ఎస్సీ హాస్టల్ ప్రభుత్వ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పదవ తరగతి విద్యార్థులకు పరీక్షకు సంబందించిన స్టడీ మెటిరియల్,ప్యాడ్లు,పెన్నులను మేడి ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆదివారం పంపిణీ చేశారు.అనంతరం మేడి ఫౌండేషన్ చైర్మన్ మేడి కృష్ణ మాట్లాడుతూ పదవ తరగతి పరీక్షల్లో ప్రధమ శ్రేణిలో ఉత్తీర్ణులైన విద్యార్థులకు బహుమతి అందజేస్తామని తెలిపారు.ఈ కార్యక్రమంలో బొడ్డు మహేష్ శ్రీనాథ్ నవీన్ మురళి థామస్ రాజేష్ చంద్ర తేజ ఉమేష్ భరత్ చరణ్ తేజ తదితరులు పాల్గొన్నారు.