క్రిస్మస్ ప్రేమ విందులో పాల్గొన్న ఎమ్మెల్యే మందుల సామెల్

తుంగతుర్తి 24 డిసెంబర్ 2024 తెలంగాణ వార్త రిపోర్టర్:- క్రీస్తు చూపిన మార్గంలో పయనించాలని ప్రపంచవ్యాప్తంగా జరుపుకునే ఏకైక పండుగ క్రిస్మస్ అని ఎమ్మెల్యే మందుల సామెల్ అన్నారు తుంగతుర్తి మండల కేంద్రంలోని శ్రీ వెంకటేశ్వర ఫంక్షన్ హాల్ లో ప్రభుత్వం తరఫున క్రిస్మస్ వేడుకలు నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామెల్ మాట్లాడుతూ ఏసుక్రీస్తు ఆశీస్సులు తుంగతుర్తి ప్రజలపై ఉండాలని తెలిపారు అనంతరం పాస్టర్ ప్రత్యేక ప్రార్థన నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఉమ్మడి నల్లగొండ జిల్లా డి సి బి డీసీఎంఎస్ డైరెక్టర్ తుంగతుర్తి సింగిల్ విండో చైర్మన్ గుడిపాటి సైదులు జడ్పీ సీఈఓ అప్పారావు తహసిల్దార్ దయానంద్ ఎంపీడీవో శేషు ఎనిమిది మండలాల తహసిల్దార్లు ఎంపీడీవోలు సింగిడివిండో చైర్మన్లు గోవర్ధన్ రాంబాబు తిరుమలగిరి మున్సిపల్ చైర్మన్ చాగంటి అనసూయ రాములు జనార్ధన్ నరేష్ స్వామిదాస్ గౌరవ అధ్యక్షులు డానియల్ పరంజ్యోతి శ్రీ మోష్ సుదీర్ వివిధ గ్రామాల పాస్టర్లు సోదరీ సోదరీమణులు తదితరులు పాల్గొన్నారు