గెట్ రాళ్ళు మార్చి దళితుల భూములను ఆక్రమించుకున్న కంచర్ల యోగేందర్ రెడ్డి
యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరు మండలం దత్తప్పగూడెం గ్రామంలో ఎస్సీలకు పొడిచేడు కుర్దు సర్వేనెంబర్ 1, 2/ఎ 285,286,287,ల లో ఉన్న భూమిని ఎస్సీ కార్పొరేషన్ ద్వారా 2003 వ సంవత్సరంలో 25 ఎకరాల 24 గుంటల భూమిని 20 మంది దళితులకు కంచర్ల యోగేందర్ రెడ్డి తండ్రి నరసింహారెడ్డి గారి దగ్గర ఎస్సీ కార్పొరేషన్ వారు దళితులకు కొనిచ్చారు ఇటువంటి భూమిలో సాగు చేద్దామనుకుంటే మా ఆర్థిక స్తోమతల వల్ల కరెంటు తీసుక రాలేక బోర్లు వేయలేక నీళ్ల సౌకర్యం లేక అట్టి భూమిని సేద్యం చేయలేకపోయాము ఇది ఆసరాగా తీసుకొని దళితులకు ఇచ్చినటువంటి భూమిని సర్వే నెంబరు ఒకటిలో 18 గుంటలు సర్వేనెంబర్ 2లో 30 గుంటల భూమిని అక్రమంగా గెట్ రాళ్లు మార్చి భూమిని ఆక్రమించుకున్నాడు ఇది ఎట్లా అని అడిగినందుకు నువ్వు ఏం చేసుకుంటావో చేసుకోపో అని దళితులను బెదిరించాడు అప్పుడు మేము ఏం చేయాలో తెలియక ఎమ్మార్వో ఆఫీస్ నుండి టిపన్ కట్టి చుట్టుపక్కల ఉన్నటువంటి భూమి ఆసాములను నోటీసు పంపించి వాళ్లని పిలిపించి టిఫన్ ద్వారా గవర్నమెంట్ సర్వేయర్ ని పిలిపించి నాలుగు సార్లు కొలిపించడం జరిగింది అప్పుడు కంచర్ల యోగేంద్ర రెడ్డికి ఉన్నటువంటి భూమిలో ఆయనకు ఉండబడిన భూమికంటే సర్వే నెంబరు ఒకట్లో తేలింది అయినా గవర్నమెంట్ సర్వేయర్ కొలిచిన భూమి వదిలిపెట్టరని గొడవ చేస్తున్నాడు సర్వేనెంబర్ రెండులో కూడా 30 గుంటల భూమిని ఆక్రమించుకున్నట్టు సర్వేలో తేలింది ముఖ్యంగా యోగేంధర్ రెడ్డి కార్పొరేషన్కు అమ్మింది ఆయనే 21 సంవత్సరాలకు ఎకరం ఎనిమిది గుంటలు ఆక్రమించింది ఆయనే మా దళితులను ఇబ్బంది పాలు చేసేది యోగేందర్ రెడ్డి మాత్రమే మేము ఈ బాధలకు తట్టుకోలేక అక్కడ భూమి మా ఇష్టానుసారమే భూమి అమ్ముకున్నము