పైరవి కారుల మాటలు నమ్మొద్దు

Jun 28, 2024 - 20:47
 0  2
పైరవి కారుల మాటలు నమ్మొద్దు

జులై మాసం తర్వాత కళ్యాణ లక్ష్మి చెక్కుతో పాటు తులం బంగారం 

కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే  తూడి మేఘారెడ్డి

కళ్యాణ లక్ష్మి చెక్కులను ఇప్పిస్తామని చెబుతూ డబ్బులు వసూలు చేసే పైరవీ కారులను నమ్మకూడదని...
నేను కాంగ్రెస్ ప్రభుత్వ ఆధ్వర్యంలో ప్రతి పని పారదర్శకంగా జరుగుతోందని ఎక్కడ ఎవరికి ఒక్క రూపాయి కూడా చెల్లించాల్సిన అవసరం లేదని వనపర్తి ఎమ్మెల్యే మేఘారెడ్డి గారు పేర్కొన్నారు

శుక్రవారం పెద్దమందడి మండల పరిధిలోని కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ లబ్ధిదారులకు మంజూరైన చెక్కుల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొని లబ్ధిదారులు అందజేశారు

ఈ సందర్భంగా ఆయన  మాట్లాడుతూ మండల పరిధిలోని పలు గ్రామాలకు చెందిన 36 మందికి షాదీ ముబారక్,  కల్యాణ లక్మి, చెక్కులు మంజూరయ్యాయని, పెండింగ్ లో ఉన్న మరో 105 చెక్కులను త్వరలోనే అందిస్తామని ఎంఎల్ఏ పేర్కొన్నారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నిరుపేద కుటుంబాలలోని ఆడబిడ్డల ఎమ్మెల్యే రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ కార్యక్రమాన్ని ప్రతి ఒక్క లబ్ధిదారునికి ఉండాలని ఆయన అధికారులకు సూచించారు

కార్యక్రమంలో ఎంపీపీ రఘు ప్రసాద్,ZPTC రఘుపతి రెడ్డి,
వైస్ ఎంపీపీ భారతి, సింగిల్ విండో అధ్యక్షులు విష్ణువర్ధన్ రెడ్డి ఎంపీడీవో సద్గుణ,  ఎంపీటీసీలు మాజీ సర్పంచ్ తదితరులు పాల్గొన్నారు

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333