ఐకెపి సెంటర్లను ప్రారంభించాలి. రైతులకు ఇస్తానన్న 500 బోనస్ ఇవ్వాలి సిపిఎం మండల మహాసభ కరపత్రం ఆవిష్కరణ

ఐకెపి సెంటర్లను వెంటనే ప్రారంభించాలి.. సన్న రకం ధాన్యానికి బొనస్ 500 రూపాయలు ఇవ్వాలి.. సిపిఎం మండల మహాసభ కరపత్రం ఆవిష్కరణ
తెలంగాణ వార్త పెన్ పహాడ్ 5 నవంబర్ :-పెన్ పహాడ్ మండల పరిధిలోని మంగళవారం నాడు లింగాల గ్రామం లో 8వ, సిపిఎం మండల మహా సభల కరపత్రాన్ని ఆవిష్కరించారు... ఈ సంధర్బంగా నెమ్మాది మాట్లాడుతూ ఇప్పటికే రైతులు పండించిన పంట చేతికి వచ్చిన కానీ సరైన మార్కేట్ సౌఖర్యం లేక పోవడం వల్ల పొలాల మధ్యనే ధాన్యం ఆరబోసి కోని ఎదురు చూస్తున్నారనీ ఆయన ఆవేదన వ్యక్తం చేశారు... ఈ సీజన్ లో అకాల వర్షాలు రావడం తో వరి పంట దిగుబడి తగ్గిందని పెట్టిన పెట్టుబడి కూడా దక్కని పరిస్థితి వుందన్నారు.. తెలంగాణ ముఖ్యమంత్రి ప్రజలకు సౌఖ దుఃఖానాల ద్వారా సన్న బియ్యం ఇస్తామని చెప్పడంతో పాటు సన్న వడ్లు పండించిన వారికి క్వింటాకు ఐదు వందల రూపాయల బోనస్ ఇస్తానని హామీ ఇవ్వడంతో రైతాంగం సన్న వడ్లు ఎక్కువగా పండించారని అందుకొరకు బోనస్ ఐదు వందల రూపాయలు వెంటనే ఇవ్వాలని నెమ్మాది కోరారు... రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల ముందు ఋణ మాఫీ చేస్తామని వాగ్దానం చేశారని కానీ 18 వేల కోట్లు మాత్రమే విడుదల చేసి చేతులు దులుపుకున్నారని నెమ్మాది విమర్శించారు... రైతు భరోసా కింద ఎకరాకు ఐదు వేలు ఇస్తామని చెప్పిన ప్రభుత్వం మాట తప్పకుండా అమలు చేయాలని నెమ్మాది కోరారు.. ఈ నెల 9వ తేదిన లింగాల గ్రామం లో జరుగు సిపిఎం మండల 8వ మహా సభల జయప్రదం చేయటానికి ప్రతి ఒక్కరు సహకరించాలని కోరారు... కరపత్రాల విడుదల కార్యక్రమంలో సిపిఎం మండల కార్యదర్శి రనపంగి కృష్ణా, సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు దనియాకుల శ్రీకాంత్, వీ రబోయిన రవి, సీనియర్ నాయకులు గుంజ వెంకటేశ్వర్లు, సిపిఎం శాఖ కార్యదర్శి బుచ్చి రాములు, భిక్షం, శేఖర్, వెంకన్న తదితరులు పాల్గొన్నారు