దళితుల పక్షపాతి వంగవీటి రామారావు
తెలంగాణ వార్త ప్రతినిధి :-దళితుల పక్షపాతి వంగవీటి రామారావు :ఎస్సీ కాలనీకి రామారావు చేసిన సేవలు కొనియాడలేనివి :కొంతమంది స్వార్ధ రాజకీయాల కోసం ఆయనపై బురద చల్లే ప్రయత్నాలు చేస్తున్నారు కొమరబండ గ్రామ ముద్దుబిడ్డ దళితుల పక్షపాతి వంగవీటి రామారావు గారి మీద తమ స్వార్ధ రాజకీయ ప్రయోజనాల కోసం రాజకీయ పబ్బం గడుపుకోవడానికి కొందరు స్వార్ధ రాజకీయ నాయకులు పెట్టే ప్రలోభాలకు తలవగ్గి దళితుల పక్షపాతి అయిన వంగవీటి రామారావు గారిపై నిన్న కొంతమంది తప్పుడు ప్రచారాలు చేస్తూ ఆయన మాటలను వక్రీకరించే విధంగా మాదిగ జాతిని కించపరచాడు అనే నెపంతో కోదాడ నడిబొడ్డున ఆయన చిత్రపటాన్ని కాల్చి దహనం చేస్తూ అవమానపరచడానికే నిరసనగా కొమరబండ దళిత సంఘాల ఆధ్వర్యంలో నేడు రంగా థియేటర్ చౌరస్తాలో ఆయన వంగవీటి రామారావు చిత్రపటానికి పాలాభిషేకం చేస్తూ నిరసన కార్యక్రమాన్ని వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా దళిత నాయకులు మాట్లాడుతూ కొమరబండ గ్రామానికి వంగవీటి రామారావు గారు చేసిన కృషి అమోఘమని ఆయన ఎంపీపీగా చేసిన కాలంలోనే కొమరబండ గ్రామంలో ప్రతి మూలన సిసి రోడ్లను నిర్మించి గ్రామంలో నీటి కొరతను తీర్చడానికే రెండు వాటర్ ట్యాంకీలను ఏర్పాటు చేసి గ్రామాన్ని సస్యశ్యామలంగా మండలంలో మొదటి స్థానంలో నిలబెట్టిన ఘనత వంగవీటి రామారావు గారిని వారు ఆయనను కొనియాడారు.కొందరు స్వార్ధ రాజకీయ నాయకులు వారి రాజకీయ పబ్బం గడుపుకోవడానికి ఆయన మీద బురద చెల్లె ప్రయత్నం చేశారే తప్ప ఆయన దళితులకు దళితుల పక్షపాతి అని ఈ సందర్భంగా వారు అన్నారు. అనంతరం కోదాడ రూరల్ పోలీస్ స్టేషన్ కు చేరుకొని వంగవీటి రామారావు చిత్రపటాన్ని కాలుస్తూ అవమానపరిచిన సదర వ్యక్తులపై తగు విచారణ జరిపి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని స్థానిక స్టేషన్ నందు దరఖాస్తు అందజేశారు, ఈ కార్యక్రమంలో కొమరబండ మత్స్య శాఖ చైర్మన్ దేవపంగు వెంకటి,మత్స్యశాఖ మాజీ అధ్యక్షులు దేవపంగు చిన్న శంబయ్య,మాజీ వార్డు నెంబర్లు కొలికపంగు వెంకటేశ్వర్లు,దేవపంగు శ్రీను,దేవపంగు ధనమూర్తి,బాలకృష్ణ,దేవపంగు సత్యనారాయణ,రాంపంగు శ్రీను,కొలికపంగు కాంతయ్య,నెమ్మాది నాగరాజు,చింతా సుధాకర్,దాసరి నాగరాజు,గుంజలూరి రామారావు,తమలపాకుల సిద్దు,చింతా అన్వేష్,మనోహర్,ప్రేమ్ కుమార్,పలువురు దళిత నాయకులు,యువకులు పాల్గొన్నారు