అవినీతి అక్రమాలకు పాల్పడినందుకే మున్సిపల్ చైర్మన్ పై అవిశ్వాస తీర్మానం

Mar 19, 2024 - 19:06
Mar 19, 2024 - 19:13
 0  262
అవినీతి అక్రమాలకు పాల్పడినందుకే మున్సిపల్ చైర్మన్ పై అవిశ్వాస తీర్మానం

తిరుమలగిరి 20 మార్చి 2024 తెలంగాణ వార్త రిపోర్టర్:-  తిరుమలగిరి మున్సిపల్ చైర్మన్ గా పోతురాజు రజిని ఎంపికైనప్పటినుండి ఏకపక్ష నిర్ణయాలు తీసుకోవడంతో తామందరూ విసిగిపోయామని ఎవరిని సంప్రదించకుండా ఎలాంటి తీర్మానాలు లేకుండా అధికారులతో కుమ్మక్కై అధిక బిల్లులు స్వాహా చేశారని స్థానికంగా అందుబాటులో ఉండకపోవడమo మున్సిపల్ కార్యాలయంలో అక్రమంగా ఉద్యోగాలు నియమించడం పలు కారణాలవల్ల మున్సిపల్ చైర్మన్ పై అవిశ్వాసం తీర్మానం చేయడం జరిగిందని ఇందులో స్థానిక శాసనసభ్యులు మందుల సామెల్  ప్రమేయం ఏమాత్రం లేదని అఖిలపక్షం మున్సిపల్ కౌన్సిలర్లు పత్రికా ప్రకటన విడుదల చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పోతురాజు రజిని  చేసిన అవినీతి అక్రమాలు కచ్చితంగా బట్టబయలు చేసి ప్రజలకు వివరిస్తామని చెప్పారు. పేద దళితుల దగ్గర దళిత బంధు పథకంలో లక్షల రూపాయలు వసూలు చేసిన తనకు దళిత అనే పదం మాట్లాడే అర్హత లేదని చెప్పారు. నాలుగేళ్ల తన పరిపాలన పూర్తిగా అవినీతి మాయమని అన్నారు. ఏనాడు కూడా సాటి మహిళా కౌన్సిలర్స్ అనే గౌరవం ఇవ్వకుండా నియంతృతంగా వ్యవహరించే వారని అన్నారు . కేవలం సంవత్సరంలో రెండు మూడు సార్లు మాత్రమే మున్సిపల్ సమావేశాలు మాజీ ఎమ్మెల్యే గాదరి కిషోర్ కుమార్ తో నిర్వహించి సమావేశంలో ఎవర్ని మాట్లాడనీ యకుండా గొంతు నొక్కిసారని, అవినీతిలో రాష్ట్రంలో మొదటి స్థానం తిరుమలగిరి మున్సిపాలిటీకె దక్కుతుందని అందుకనే తనపై అవిశ్వాసం తీర్మానం ప్రవేశ పెట్టి పట్టణాన్ని అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో తామున్నామనే విశ్వాసం తిరుమలగిరి పట్టణ ప్రజలకు కల్పించామని అఖిలపక్ష కౌన్సిలర్లు అన్నారు. ఈ  సమావేశంలో కౌన్సిలర్లు చాగంటి అనసూయ పొన్నం రాజ్యలక్ష్మి పత్తి పురం సరిత కుదురుపాక శ్రీలత కన్నబోయిన రేణుక గిల కత్తుల ప్రియులత రాము గౌడ్ తదితరులు పాల్గొన్నారు

Jeripothula ramkumar Thungaturti constant and Tirumalagiri Mandal Reporter (RC) Suryapet District Telangana State JRK 7674007034