అక్షరాస్యత ఉంటే అన్నింటిలో ముందంజ:ఎస్సై శ్రీనివాస్ రావు
జోగులాంబ గద్వాల 22 ఆగస్టు 2024 తెలంగాణ వార్తా ప్రతినిధి:- ఏ గ్రామమైన, దేశమైనా అక్షరాస్యతలో ముందు ఉంటేనే అన్నింట అభివృద్ధి చెందుతామని మండల ఎస్సై శ్రీనివాస్ రావు తెలిపారు. గురువారం జిల్లా కలెక్టర్ బి ఎం సంతోష్ ఆదేశాలతో డిపిఆర్ఓ రఫీ యుద్దీన్ ఆధ్వర్యంలో తెలంగాణ సాంస్కృతిక సారథి ఆధ్వర్యంలో కేటి దొడ్డి మండలం గువ్వల దీన్నే గ్రామంలో అక్షరాస్యత, బాల్యవివాహాల నిర్మూలన, పరిసరాల పరిశుభ్రత తదితర అంశాలపై కళాజాత కళాకారుల ఆధ్వర్యంలో ప్రజలకు పాట రూపంలో అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా హాజరైన ఎస్ఐ మాట్లాడుతూ గ్రామాలలో బాల్యవివాహాలు అరికట్టాలని సూచించారు. ప్రతి ఒక్కరూ తమ పిల్లలను చదివించే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. పిల్లలను పనిలో పెట్టుకుంటే కేసులు చెప్పవని హెచ్చరించారు. అలాగే ప్రతి ఒక్కరు హెల్మెట్ ధరించి వాహనాలు నడపాలని మద్యం సేవించి వాహనం నడిపితే జైలుకు వెళ్ళక తప్పదని హెచ్చరించారు. ప్రతి ఒక్కరూ ప్రభుత్వ సూచనలు పాటించి అభివృద్ధికి సహకరించాలని ఎస్సై శ్రీనివాస్ రావు తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ సంస్కృతిక సారధి కళాకారులు పాల్గొన్నారు.