15 నెలల బాబుకు లివర్ ప్రాబ్లం

Mar 19, 2024 - 18:56
 0  4
15 నెలల బాబుకు లివర్ ప్రాబ్లం

దాతలు ఆర్థిక సహాయం కోసం ఎదురుచూస్తున్న కుటుంబ సభ్యులు

జోగులాంబ గద్వాల 19 మార్చ్ 2024 తెలంగాణ వార్తా ప్రతినిధి:- ఇటిక్యాల. ఈ ఫోటోలో కనిపిస్తున్న మౌనిక భర్త మల్దకంటి రెసిడెన్సి ఆఫ్ గోపల్ దిన్నే గ్రామం,  ఇటిక్యాల మండలం, జోగులాంబ గద్వాల్ జిల్లా (ప్రస్తుత నివాసం గద్వాల మండలం కొత్తపల్లి గ్రామం) కు  చెందిన వీరికి కింగ్ జాన్సన్ విక్టరీ 15 నెలల బాబు ఉన్నాడు.  ఈ బాబు కన్నా ముందర గతంలో కూతురు పుట్టి లీవర్  ప్రాబ్లంతో చనిపోయింది. మరల ఈ వీరికి కుమారుడు పుట్టాడు. అయితే ఇప్పుడు ఆ బాబుకు కూడా లివర్  ప్రాబ్లం అని హైదరాబాద్ ఫేస్ హాస్పిటల్ డాక్టర్స్ తెలిపారన్నారు.  బాబుకి లివర్ మార్పిడి చేస్తే బ్రతికే అవకాశం ఉంది అని డాక్టర్స్ తెలిపారని,  అందుకుగాను ఆపరేషన్ కు 15 లక్షల రూపాయల వరకు ఖర్చు అవుతుంది అని తెలిపారు. ఒక తండ్రిగా  కుమారుని బ్రతికించుకోవాలని బాబు తండ్రి చెయ్యని ప్రయత్నం అంటూ లేదు. దయచేసి ఆ బిడ్డకు ఆర్థికంగా సహాయం చేయగలరని  దాతలైనటువంటి మీరు ఆర్థిక సహాయం అందించి ఆ బిడ్డ ప్రాణాలకు రక్షణగా నిలిచి మీకు తోచిన ఆర్థిక సహాయం అందించి బాబు ప్రాణాలను కాపాడాలని మీ వంతు సహాయ సహకారాలు అందించాలని  పెద్దలందరికీ విన్నవించడం జరిగింది మీరు అందించే ఈ ఆర్థిక సహాయంతో బాబు ప్రాణాలను కాపాడాలని ప్రతి ఒక్కరికి ఈ రిక్వెస్ట్ ను మీ ముందర ఉంచడం జరిగింది.  మీకు తోచిన ఆర్థిక సహాయం అందించి విలువైన ఈ చిన్న బాబు ప్రాణాలను కాపాడాలని బాబు తండ్రి కన్నీటితో వేడుకుంటున్నాడు. దాతలు డొనేట్ చేయాల్సిన ఫోన్ పే  నెంబర్.9985352790. తల్లిదండ్రులు కోరారు

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333