అంజనపల్లి జానయ్య జీవితం స్ఫూర్తి దాయకం...
నీతికి నిజాయితీకి నిలువెత్తు నిదర్శనంఆయన జీవితం... అంజన పల్లి జానయ్య సంతాప సభలో సిపిఎం జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జున రెడ్డి

తెలంగాణ వార్త పెన్ పహాడ్ : అంజన పల్లి జానయ్య జీవితం స్ఫూర్తిదాయకంమని సిపిఎం జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జున రెడ్డి అన్నారు. ఆదివారంసూర్యాపేట జిల్లా పెన్ పహాడ్ మండలం చెట్ల ముకుందాపురం గ్రామంలో నిర్వహించిన సిపిఎం సీనియర్ నాయకులు అంజనపల్లి జానయ్య సంతాప సభకు ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ అనేక పోరాటాలకు త్యాగాలకు నిలయమైన చెట్ల ముకుందాపురం గ్రామంలో గ్రామంలో సామాన్య వ్యవసాయ కార్మిక కుటుంబంలో పుట్టిన అంజన పల్లి జానయ్య తన జీవితాంతం నమ్మిన సిద్ధాంతం కోసంపని చేసినగొప్ప నేత అని అన్నారు.చదువు తక్కువగా ఉన్నపార్టీ నిర్ణయాలను,విధానాలనుతూచా తప్పకుండాఅమలు చేశారని అన్నారు.ఎన్ని నిర్బంధాలు వచ్చిన, ఆటంకాలు వచ్చిన నికార్సైన కమ్యూనిస్టుగా జీవించారని అన్నారు. చెట్ల ముకుందాపురం గ్రామంలో శత్రువుల దాడులను ఎదుర్కొని గ్రామంలో ఎర్ర జెండాను నిలబెట్టడంలో అంజన పల్లి కుటుంబం నిర్వహించినప్రముఖ పాత్ర పోషించారనిగుర్తు చేశారు.పార్టీలో చీలికలు వచ్చినప్పుడు సైతం సిపిఎం వైపు నిలిచి పార్టీని కంటికి రెప్పలా కాపాడినత్యాగశీలి అంజన పల్లి జానయ్య అన్నారు. అంజన పెళ్లి జానయ్య భార్య పిచ్చమ్మ వ్యవసాయ కార్మిక సంఘంలో, మహిళా సంఘంలో పనిచేశారని చెట్ల ముకుందాపురం గ్రామం నుండి ఒక పర్యాయం ఎంపీటీసీగా, మూడుసార్లు కొక్కిరేణి సొసైటీకి సింగిల్ నుండో డైరెక్టర్ గా గెలిసి ప్రజల హృదయాలలో చెరగని ముద్ర వేసిందన్నారు. 8 మంది ఆడపిల్లలను కానీ వారికి విద్యాబుద్ధులు నేర్పి వారిని ప్రభుత్వ ఉద్యోగులుగా తీర్చిదిద్దడంలో అంజన పెళ్లి జానయ్య, పిచ్చమ్మల పాత్ర గొప్పదన్నారు. నీతి, నిజాయితీగా పనిచేస్తూగ్రామంలో వచ్చినప్రజా సమస్యలనునిక్కచ్చిగా మాట్లాడివాటిని సామరస్యంగాపరిష్కరించడంలో అంజన పల్లి జానయ్య, పిచ్చమ్మ కృషి మరువలేనిదని అన్నారు. ఎన్నో ప్రలోభాలకు గురై పార్టీలు మారుతున్న ఈ రోజుల్లోతాను నమ్మిన సిద్ధాంతానికినిలబడికడదాకా కమ్యూనిస్టు యోధుడుగానిలబడిఆ గ్రామ ప్రజల మనసులను చురగున్నమంచి వ్యక్తిత్వం కలిగిన మహనీయుడు జానయ్య అన్నారు.ఆయన ఆశయ సాధన కోసం నేటి యువత ఆదర్శంగా తీసుకొని ముందుకు సాగాలని ఎర్ర జెండా వారసత్వాన్ని కొనసాగించాలనిపిలుపునిచ్చారు.ఈ సంతాప సభలో కళాకారులు పాడిన విప్లవ గేయాలు ప్రజలను విశేషంగా కట్టుకున్నాయి. సిపిఎం మండల కార్యదర్శి గుంజ వెంకటేశ్వర్లు అధ్యక్షతన జరిగినఈ సంతాప సభలోసిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులునెమ్మది వెంకటేశ్వర్లు, సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ములకలపల్లి రాములు,మట్టి పెళ్లి సైదులు, సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు ధనియాకుల శ్రీకాంత్ వర్మ, వట్టపు సైదులు, మిట్ట గనుకుల ముత్యాలు, షేక్ సైదా, బచ్చలకూర స్వరాజ్యం తెలంగాణ రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షులు మేదరమెట్ల వెంకటేశ్వరరావు, సిపిఎం పార్టీ మునగాల మండల కార్యదర్శి బుర్రి శ్రీరాములు, ప్రజానాట్యమండలి జిల్లా అధ్యక్షులుబి.రాంబాబు, సిపిఎం పార్టీ మండల నాయకులు రణపంగా కృష్ణ, మడ్డి అంజి బాబు, కొండమీది రాములు, గుర్రం గోపాల్ రెడ్డి, బొమ్మిరెడ్డి గోపిరెడ్డి, నందిగామ సైదులు, కట్టెల విజయ్ కుమార్, ధనియాకుల శ్రీను తదితరులు పాల్గొన్నారు.