హనుమాన్ చాలీసా పారాయణం లో ఇంటర్నేషనల్ వండర్ బుక్ ఆఫ్ రికార్డ్ ,
మూడున్నర లక్షల పైగా హనుమాన్ చాలీసా పారాయణం లో
ఇంటర్నేషనల్ వండర్ బుక్ ఆఫ్ రికార్డ్ , జీనియస్ బుక్ ఆఫ్ రికార్డులను
అందుకున్న వేములపల్లి వెంకటేశ్వరరావు , గన్నవరపు నాగేశ్వరావు లు
ఖమ్మం 23 ఫిబ్రవరి 2025 తెలంగాణవార్త రిపోర్టర్:- శ్రీ స్థంభాద్రి ఆధ్యాత్మిక సమితి ఖమ్మం వారిచే ఆదివారం స్థానిక పెవిలియన్ గ్రౌండ్లో శత సహస్ర హనుమాన్ చాలీసా పారాయణం కార్యక్రమం అంగరంగ వైభవంగా సుమారు గా నాలుగువేల మంది పైచిలుకు భక్తులుతో అత్యంత భక్తిశ్రద్ధలతో సుమారు మూడున్నర లక్షల పైగా హనుమాన్ చాలీసా పారాయణం జరిగింది . ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ , ఆర్జెసి కృష్ణ వీరితో పాటు ప్రముఖులు పాల్గొన్నారు . మొట్ట మొదటి సారిగా ప్రపంచంలో రికార్డు స్థాయిలో నిర్వహించి ఇంటర్నేషనల్ వండర్ బుక్ ఆఫ్ రికార్డ్ మరియు జీనియస్ బుక్ ఆఫ్ రికార్డుల స్థానని వేములపల్లి వెంకటేశ్వరరావు , గన్నవరపు నాగేశ్వరావు లు సంపాదించుకున్నారు . వీరికి వండర్ బుక్ ఆఫ్ ఇండియా చీఫ్ కో ఆర్డినేటర్ బింగి నరేంద్ర గౌడ్ , జీసస్ బుక్ ఆఫ్ రికార్డు కో ఆర్డినేటర్ వివిఎల్ శర్మ లు రికార్డులను అందించారు . ఈ సందర్భంగా వారు హిందూ సనాత ధర్మాన్ని కాపాడే దిశలో రామభక్త హనుమాన్ చాలీసా ను ఓకే కంఠంతో పలకడం చాలా విశేషం అన్నారు . ఇంత అద్భుతమైన కార్యక్రమాన్ని నిర్వహించినందుకు స్తంభాద్రి ఆధ్యాత్మిక సమితి చైర్మన్ వేములపల్లి వెంకటేశ్వరరావు , సెక్రటరీ గన్నవరపు నాగేశ్వరరావు , డైరెక్టర్స్ లగడపాటి రామారావు , ప్రతాపని నరసింహారావు , కటకం చిన్న హనుమంతరావు , కురువెళ్ల జగన్మోహన్ రావు , అరవపల్లి నిరంజన్ , పివిడి ప్రసాద్ లను అభినందించారు . తెలంగాణ కో ఆర్డినేటర్ ఇసనపల్లి నాగేష్ , నాగ సాయి , నవీన్ , వివి రెడ్డి పాల్గొన్నారు .