విద్యార్థులను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దేది ఉపాధ్యాయులు

Sep 5, 2024 - 18:38
Sep 5, 2024 - 19:03
 0  13
విద్యార్థులను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దేది ఉపాధ్యాయులు

*విద్యార్థులను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దే వారు ఉపాధ్యాయుడు : దొంగరి గోపికృష్ణ తెలంగాణ వార్త *పెన్ పహాడ్ మండలం సెప్టెంబర్ విద్యార్థులను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దే వారే ఉపాధ్యాయుడు అని కాంగ్రెస్ పార్టీ నాయకులు దొంగరి గోపికృష్ణ అన్నారు. గురువారం ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా మండల పరిధి లింగాల గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, ప్రాథమిక పాఠశాలలో ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ రాష్ట్రపతి ,భారతరత్న అవార్డు గ్రహీతసర్వేపల్లి రాధాకృష్ణ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. అనంతరం ముఖ్యఅతిథిగా విచ్చేసిన గ కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు దొంగరి గోపికృష్ణ ఉపాధ్యాయుల అందరికీ శాలువాలు కప్పి ఘనంగా సన్మానించి వారందరికీ ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ తాను చదువుకున్నప్పటి రోజులను గుర్తు చేసుకుంటూ ఉపాధ్యాయుడు విద్యార్థుల్లో ఉన్నటువంటి అజ్ఞానం అనే అంధకారాన్ని తొలగించి జ్ఞాన జ్యోతులను వెలిగించేవాడని, విద్యార్థులను క్రమశిక్షణతో నడిపించే వారే ఉపాధ్యాయులని అన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాలల ప్రధానోపాధ్యాయులు యుగంధర్, కోటేశ్వరరావు ఉపాధ్యాయులు జమాల్ షరీఫ్ , ఖాసీం, శివశంకర్, గోవింద్ నాయక్, సైదా నాయక్ రవిబాబు, మాధురి, పల్లె దవాఖాన డాక్టర్ రవీందర్ నాయక్ ,విద్యార్థిని విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు

Harikrishna Penpahad Mandal Reporter Suryapet Dist Telangana State