బడి పిల్లలకు నాణ్యతమైన పరీక్షలు చేపట్టాలి జిల్లా వైద్యారోగశాఖ అధికారి డాక్టర్ సిద్ధప్ప .
జోగులాంబ గద్వాల 8 ఆగస్టు 2024 తెలంగాణవార్త ప్రతినిధి.:- గద్వాల. జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయంలో ఈరోజు రాష్ట్రీయ బాల్ స్వాస్త్య కార్యక్రమం ( RBSK ) గద్వాల మండలం మరియు అలంపూర్ మండలాలలో పరీక్షలు నిర్వహిస్తున్న డాక్టర్లు మరియు వారి బృందానికి ఈరోజు ఆర్ బి ఎస్ కే ప్రోగ్రాం పై డిఎంహెచ్వో డాక్టర్ సిద్ధప్ప రివ్యూ తీసుకున్నారు.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఈ కార్యక్రమం పిల్లల మొత్తం జీవన నాణ్యతను మెరుగుపరచడానికి మరియు సమాజంలోని పిల్లలందరికీ సమగ్ర సంరక్షణ అందించే కార్యక్రమం గా భావించి పుట్టినప్పటి నుండి 18 సంవత్సరాల వయసు గల పిల్లలకు పుట్టుకతో వచ్చే లోపాలు, వ్యాధులు ముందుగానే గుర్తించి, ఉచిత చికిత్స అందివ్వాలని , 32 సాధారణ ఆరోగ్య పరిస్థితులను ముందుగానే గుర్తించడం, అందులో కార్డియాక్ కేసులు మరియు పుట్టకతో వచ్చే లోపాలకు చికిత్స అందించడానికి తద్వారా పిల్లలకు సకాలంలో సంరక్షణ అందించడానికి దోహదపడుతుందని ఇట్టి కార్యక్రమం స్కూల్ యందు RBSK సిబ్బంది సమయపాలన పాటించి పిల్లలకు స్క్రీనింగ్ నిర్వహించాలని తెలిపారు.