వరల్డ్ కన్జ్యూమర్ రైట్స్ సంస్థ నల్గొండ జిల్లా వైస్ చైర్మన్ గా బద్దం నాగరాజు గౌడ్
వరల్డ్ కన్జ్యూమర్ రైట్స్ సంస్థ నల్గొండ జిల్లా వైస్ చైర్మన్ గా బద్దం నాగరాజు గౌడ్
నల్గొండ జిల్లా నకిరేకల్ మండలానికి చెందిన బద్దం నాగరాజు గౌడ్ నల్గొండ జిల్లా వైస్ చైర్మన్ గా వరల్డ్ కన్జ్యూమర్ రైట్స్ సంస్థ జాతీయ చైర్మన్ బలగం పూర్ణచంద్ర గౌడ్ గారు నియామకం చేసి ఉత్తర్వులు జారీ చేశారు. వినియోగదారుల శ్రేయస్సు కోసం దళారీ వ్యవస్థ నిర్మూలన కోసం సమాజంలో ప్రజలకి నాణ్యత మైన ఆహార పదార్థాలు అందించే విధంగా వరల్డ్ కన్జ్యూమర్ రైట్స్ సంస్థ పనిచేస్తుందని నాగరాజు గౌడ్ వెల్లడించారు నాణ్యత పరమైన లోపాలు ఉన్న సేవాపరమైన లోపాలు ఉన్న వినియోగదారుల కు ఇతర సమస్యలు ఉన్న తమ దృష్టికి తీసుకొని వస్తే వారికి వెన్నంటే ఉండి సమస్యను పరిష్కరిస్తామని అన్నారు అదేవిధంగా అవగాహన సదస్సు కార్యక్రమాలు ఏర్పాటు చేసి ప్రజలను చైతన్య పరుస్తామన్నారు వినియోగదారుల హక్కుల గురించి, వాటి చట్టాలపై వారికి అవగాహన కలిపిస్తామన్నారు. ఈ ఒక్క అవకాశం కలపరిచిన వరల్డ్ కన్జ్యూమర్ రైట్స్ సంస్థ తెలంగాణ రాష్ట్ర చైర్మన్ సత్యనారాయణ గారికి, అలాగే తెలంగాణ రాష్ట్ర వైస్ చైర్మన్ మెరుగు రాధాకృష్ణ గారికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేశారు.