ప్రతి ఒక్కరూ జెండా పండుగలో ఉత్సాహంగా పాల్గొనాలి సంకినేని
ప్రతి ఒక్కరూ జెండా పండగలో ఉత్సాహంగా పాల్గొనాలి
జాతీయ సమైక్యతను కాపాడటం మనందరి బాధ్యత
సూర్యాపేట జిల్లా కేంద్రంలోని తన నివాసంపై త్రివర్ణ పతాకాన్ని ఎగరేసిన
బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షులు సంకినేని వెంకటేశ్వరరావు
తెలంగాణ వార్త సూర్యపేట జిల్లా ప్రతినిధి:- ప్రధానమంత్రి నరేంద్రమోదీ పిలుపు మేరకు ప్రతి ఒక్కరూ తమ ఇంటిపై మువ్వన్నెల జెండాను ఎగురవేయాలని బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షులు సంకినేని వెంకటేశ్వరరావు కోరారు. ‘హర్ ఘర్ తిరంగా’ కార్యక్రమంలో భాగంగా.. సూర్యాపేట లోని తమ నివాసంలో సంకినేని వెంకటేశ్వరరావు జాతీయ జెండాను ఎగురవేశారు. మూడేళ్లుగా కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఈ ఉత్సవాలు ప్రజలందరి భాగస్వామ్యంతో ఘనంగా జరుగుతున్నాయని అన్నారు.. ఈ సందర్భంగా సూర్యాపేటలో పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు జాతీయ జెండాను చేతబూని నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు పాల్గొన్నారు..