యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు గా ఎలిమినేటి అభినయ్ కు ఓటు వేసి గెలిపించాలి

Aug 14, 2024 - 21:35
Aug 15, 2024 - 08:45
 0  9
యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు గా ఎలిమినేటి అభినయ్ కు ఓటు వేసి గెలిపించాలి

యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులుగా ఎలిమినేటి అభినయ్ కు ఓటు వేసి గెలిపించాలి

ఎఐసిసి సభ్యులు రాంరెడ్డి సర్వోత్తమ రెడ్డి, పార్టీ రాష్ట్ర నాయకులు కొప్పుల వేణారెడ్డి

సూర్యాపేట, 15 ఆగస్టు 2024 తెలంగాణవార్త రిపోర్టర్:- యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు మరియు ఇతర పదవులకు ఎన్నికలు జరుగున్న నేపధ్యంలో సూర్యాపేట జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు గా పోటీ చేస్తున్న సూర్యాపేట 15 వ వార్డు కౌన్సిలర్ యువ నాయకులు ఎలిమినేటి అభినయ్ కు యువజన కాంగ్రెస్ నాయకులు పెద్దసంఖ్యలో ఓట్లు వేసి గెలిపించాలని ఎఐసిసి సభ్యులు రాంరెడ్డి సర్వోత్తమ రెడ్డి, రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు, పబ్లిక్ క్లబ్ కార్యదర్శి కొప్పుల వేణారెడ్డి అన్నారు. బుధవారం జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నందు జరిగిన యువజన కాంగ్రెస్ నాయకుల విస్తృత స్థాయి సమావేశంలో వారు మాట్లాడుతూ యువజన కాంగ్రెస్ పార్టీ కి వెన్నెముక వంటిదని అన్నారు. యూత్ కాంగ్రెస్ నాయకులు గా ఎన్ డి తివారీ, సంజయ్ గాంధీ వంటి నాయకులు పనిచేశారని అన్నారు. మాజీ మంత్రి, సూర్యాపేట నియోజకవర్గం ఇంఛార్జ్ రాంరెడ్డి దామోదర్ రెడ్డి కి యూత్ కాంగ్రెస్ తో విడదీయరాని అనుబంధం వుందని అన్నారు. 1978 లో యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు గా వి. హనుమంతరావు, ఉపాధ్యక్షులు గా నారా చంద్రబాబు నాయుడు, ఆర్గనైజింగ్ సెక్రటరీగా గా కెసిఆర్ పనిచేసిన సమయంలో రాంరెడ్డి దామోదర్ రెడ్డి రాష్ట్ర కోశాధికారి గా పనిచేశారని అన్నారు. యూత్ కాంగ్రెస్ నాయకులు పార్టీ పట్ల నమ్మకం, విధేయత, సిద్దాంతం పట్ల అవగాహన కలిగి వుంటారని అన్నారు. 18 నుండి 35 సంవత్సరాల వయసు కలిగిన వారు యూత్ కాంగ్రెస్ సభ్యులుగా చేరవచ్చని అన్నారు. యూత్ కాంగ్రెస్ లో వంద సభ్యత్వాలు చేర్పించిన వారికి యాక్టివ్ మెంబర్ గా గుర్తింపు ఇస్తామని అన్నారు. ప్రభుత్వ సంక్షేమ పధకాలు అమలు చేసే సమయంలో యాక్టివ్ మెంబర్ లకు ప్రాధాన్యత ఇస్తామని అన్నారు. రాజీవ్ గాంధీ, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ లు యూత్ కాంగ్రెస్ కు ప్రాణం పోశారని అన్నారు. సోషల్ మీడియా లో పార్టి మరియు ప్రభుత్వ కార్యక్రమాలను విస్తృతంగా ప్రచారం చేయాలని అన్నారు. పార్టీలో సభ్యత్వ నమోదు కోసం గ్రామాలలో విద్యావంతులు, మేధావులను కలవాలని, తటస్థంగా వుండేవారిని పార్టీ లో చేరేవిధంగా ప్రోత్సహించాలని అన్నారు. సూర్యాపేట నియోజకవర్గం నుండి యూత్ కాంగ్రెస్ కు ముప్పై వేల మందికి సభ్యత్వం ఇవ్వాలని అన్నారు. సభ్యత్వ నమోదు ప్రక్రియ ఆన్ లైన్ లో వుంటుందని చేరే వారి వివరాలతో ఆన్ లైన్ లో నమోదు చేయాలని అన్నారు. సూర్యాపేట జిల్లా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడ ఎలిమినేటి అభినయ్ కి మద్దతు ఇస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఫ్లోర్ లీడర్ కక్కిరేణి శ్రీనివాస్, యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు, కౌన్సిలర్ బైరు శైలేందర్, అనంతుల యాదగిరి, బచ్చలకూరి శ్రీనివాస్, కొండపల్లి దిలీప్ రెడ్డి, నెల్లుట్ల లింగస్వామి, గండూరి రమేష్, పలువురు పార్టీ నాయకులు పాల్గొన్నారు.

Shake Jaheer Staff Reporter Suryapet District Telangana 508223