మాజీ మంత్రుల హరీష్ రావు జగదీశ్ రెడ్డి అక్రమ అరెస్టులు ఖండిస్తున్నాం మాజీ జెడ్పిటిసి మామిడి అనిత అంజయ్య

Dec 5, 2024 - 17:48
Dec 5, 2024 - 19:20
 0  1
మాజీ మంత్రుల హరీష్ రావు జగదీశ్ రెడ్డి అక్రమ అరెస్టులు ఖండిస్తున్నాం మాజీ జెడ్పిటిసి మామిడి అనిత అంజయ్య

మాజీ మంత్రి లు జగదీష్ రెడ్డి హరీష్ రావు ల అక్రమ అరెస్ట్ తీవ్రంగా ఖండిస్తున్నాం* మాజీ జెడ్పిటిసి మామిడి అనిత అంజయ్య

 తెలంగాణ వార్త పెన్ పహాడ్ డిసెంబర్ 05 : రాష్ట్రంలో రేవంత్ రెడ్డి పరిపాలన చూస్తుంటే ఆనాటి కాంగ్రెస్ పాలనలో ఎమర్జెన్సీ రోజులే గుర్తు వస్తున్నాయి అని పెన్ పహాడ్ మాజీ జడ్పీటీసీ మామిడి అమిత అంజయ్య అన్నారు గురువారం మండలంలోని అనంతారం గ్రామంలోని ఆమె నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ కౌశిక్ రెడ్డి ని అరెస్ట్ చేసినందున నేడు హైదరాబాద్ లో ని కౌశిక్ రెడ్డి నివాసానికి వెళ్లి న మాజీ మంత్రి జగదీష్ రెడ్డి అక్రమంగా అరెస్ట్ చేసి రాయదుర్గం పోలీస్ స్టేషన్లకు తరలించడం అప్రజాస్వామికంమని ఇది రజాకార్ల పాలన కంటే దారుణ‌మైన పాలన అని. ఈ క్ర‌మంలోనే ప్రశ్నించే గొంతుల‌ను నొక్కేందుకు య‌త్నిస్తున్నారు. అక్ర‌మ అరెస్టుల‌తో భ‌య‌పెట్టాల‌ని చూస్తే.. ఇక్క‌డ భ‌య‌ప‌డేవారు ఎవ‌రూ లేరు. రేవంత్ రెడ్డి దుర్మార్గంగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. హ‌రీశ్‌రావును జగదీష్ రెడ్డి లను అరెస్టు చేసి భ‌య‌పెట్టించాల‌నుకోవ‌డం.. సీఎం రేవంత్ రెడ్డి మూర్ఖ‌త్వ‌మే. అక్ర‌మ అరెస్టుల విష‌యంలో కాంగ్రెస్ ప్రభుత్వం త‌క్ష‌ణ‌మే క్షమాపణ చెప్పి మాజీ మంత్రులు హ‌రీశ్‌రావు,జగదీష్ రెడ్డి వెంట‌నే విడుద‌ల చేయాల‌ని మామిడి అనిత డిమాండ్ చేశారు.కార్యక్రమంలో రైతు బంధు సమితి మండల మాజీ అధ్యక్షులు పొదిలా నాగార్జున.బి.ఆర్ ఎస్ మైనార్టీ సెల్ మండల అధ్యక్షులు షేక్ మస్తాన్.బి.ఆర్ ఎస్ పార్టీ మండల సీనియర్ నాయకులు చిటేపు నారాయణ రెడ్డి. దండెం పల్లి సత్యనారాయణ గౌడ్. పాల్గొన్నారు

Harikrishna Penpahad Mandal Reporter Suryapet Dist Telangana State