నిరుపయోగంగా శవ పరీక్ష కేంద్రం

Dec 5, 2024 - 17:08
Dec 5, 2024 - 19:21
 0  3
నిరుపయోగంగా శవ పరీక్ష కేంద్రం

నిరుపయోగంగా శవపరీక్ష కేంద్రం 

చర్ల మండల కేంద్రంలో లక్షల రూపాయలు వ్యయంతో నిర్మించిన శవ పరీక్షాకేంద్రం పట్ల అధికారుల నిర్లక్ష్య వైఖరి నశించాలి:

cpiml మాస్ లైన్ ప్రజా పంథా పార్టీ చర్ల మండల కార్యదర్శి కొండా కౌశిక్ డిమాండ్.

చర్ల, డిసెంబర్ 05: చర్ల మండల కేంద్రంలో శవపరిక్షా కేంద్రాన్ని లక్షల రూపాయల వ్యయంతో నిర్మించి నేటికి సంవత్సరకాలం గడుస్తున్నప్పటికీ ఇంతవరకు పోస్టుమార్టం రూమును ఎందుకు ప్రారంభం చెయ్యట్లేదని సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ ప్రజా పంథా పార్టీ చర్ల మండల కార్యదర్శి కొండ కౌశిక్ గురువారం అధికారులను ప్రశ్నించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ ఏజన్సీ ప్రాంత ప్రజలకు చర్లలో శవపరీక్ష కేంద్రం ఏర్పాటు చేసింది దేనికోసమో సంబంధిత అధికారులు మండల ప్రజలకు సమాధానం చేప్పాలని ఆయన అన్నారు. ఏజెన్సీ ప్రాంత ప్రజలు అంటే ఈ ప్రభుత్వం ఎందుకు ఇంత చులకన భావం చూపుతుందని మండిపడ్డారు. పోస్టుమార్టం రూమును నిర్మించి సంవత్సరకాలం గడుస్తున్న ఇంతవరకు ప్రారంభానికి నోచుకోకపోవడం దుర్మార్గం అని అన్నారు. కచ్చితంగా అధికారుల నిర్లక్ష్యమే ఇందుకు నిలువెత్తు నిదర్శనం అని తెలిపారు. మండలంలో ఎవరికైనా జరగరానిది ఏదైనా జరిగి చనిపోతే పరిస్థితుల రీత్య పోస్టుమార్టం అవసరం పడి హుటాహుటిన చర్ల లోని ప్రభుత్వ ఆసుపత్రికి మృతదేహాన్ని తీసుకువస్తే అక్కడ పోస్టుమార్టం గది అందుబాటులో లేకపోవడంతో ఎక్కడో యాభై కిలోమీటర్లు పైగా దూరంలో ఉన్న భద్రాచలంకు ఆ మృతదేహాన్ని తరలించడం అలాగే ఒక్కరోజులో అయ్యే పోస్టుమార్టం రెండు రోజులు పట్టడం సంబంధింత కుటుంబ సభ్యులకు ఎంతో దుక్కాన్ని మిగిలిస్తుందని ఇది దుర్మార్గం అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.ఇప్పటికే అనేక సార్లు ఇట్టి సమస్య పై మా పార్టీ ఆధ్వర్యంలో అధికారులకు గతంలో వినతిపత్రాలు ఇవ్వడం జరిగిందని కానీ ఫలితం మాత్రం సూన్యం అన్నారు.జిల్లా కలెక్టర్ స్పందించి చర్లలో లక్షల వ్యయంతో నిర్మించిన పోస్టుమార్టం గదికి కావలసిన సంబంధిత పరికరాలను తక్షణమే ఏర్పాటు చేసి మండల ప్రజలు గురవుతున్న ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని cpiml మాస్ లైన్ ప్రజాపందా పార్టీ చర్ల మండల కార్యదర్శి కొండ కౌశిక్ డిమాండ్ చేశారు. లేనియెడల ప్రజలు పడుతున్న ఈ సమస్య శాశ్వత పరిష్కారం కై ప్రజాపంథా పార్టీ ఆధ్వర్యంలో ప్రజలను పెద్ద ఎత్తున ఐక్యం చేసి ఉద్యమ బాట పడతామని హెచ్చరించారు. ఈ సమస్యను పరిష్కారం చేయకపోతే ఈ ప్రభుత్వం ప్రజా ఆగ్రహానికి గురికాక తప్పదని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో పార్టీ మండలకమిటి సభ్యులు చెన్నం మోహన్,సుజాత, సరళ,నాగమణి,కార్తిక్, తదితరులు పాల్గొన్నారు.