పశువులకు గర్భాదారణ పరీక్షలు నిర్వహించిన డాక్టర్ స్వాతి
05-12-2024 తెలంగాణ వార్త ప్రతినిధి చిన్నంబావి మండలం: చిన్నంబావి మండలం పరిసర ప్రాంతమైన అయ్యవారిపల్లి గ్రామంలో గోపాలమిత్ర కేంద్రం జిల్లా పశుగణాభివృద్ధి సంఘం మరియు పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో పాడి పశువుల గర్భకోశ చికిత్స శిబిరం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి మండల పశువైద్యాధికారి డాక్టర్ స్వాతి పశువులకు గర్భకోశ చికిత్సలు నిర్వహించారు.15 పశువులకు గర్భకోశ చికిత్సలు, సాధారణ చికిత్సలు 40 పశువులకి కృత్రిమ గర్భ ధారణలు, 6 దూడలకు నటల నివారణ మందులు, 36 మరియు ఖనిజలవనాల మిశ్రమం అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో మండల పశువైద్యాధికారి డాక్టర్ స్వాతి జూనియర్ వెటర్నరీ ఆఫీసర్ లలిత గోపాలమిత్ర సూపర్వైజర్ శ్రీనివాసులు, గోపాల మిత్రులు మద్దిలేటి,రాజు,రాజు సిబ్బంది గ్రామ రైతులు పాల్గొన్నారు.