డిఈవోపై చర్యలు తీసుకోవాలి...

Jul 1, 2024 - 20:22
 0  9
డిఈవోపై చర్యలు తీసుకోవాలి...

సూర్యాపేట : ప్రైవేటు పాఠశాలల అక్రమాలను దృష్టికి తీసుకవెళ్ళిన స్పందించని సూర్యాపేట జిల్లా విద్యాశాఖ అధికారి పై చర్యలు తీసుకోవాలని జిల్లా జర్నలిస్టులు కలెక్టర్ తేజస్ నందలాల్ పవర్ ను కోరారు. చివ్వెంల మండలం బీబీగూడెంలో అనుమతులు లేకుండా శ్రీ చైతన్య పాఠశాలను నడుపుతున్నారని, నిర్మాణంలో ఉన్న భవనంతో పాఠశాల నిర్వహించడంతో విద్యార్ధులకు ప్రమాదం జరిగే అవకాశం ఉందని విద్యార్థుల తల్లి దండ్రులు, ప్రజలు జర్నలిస్టుల దృష్టికి తీసుకురాగా ఈ విషయం వారు డిఈవోకు తెలిపారు. కాని డిఈవో నిర్లక్ష్యంగా వ్యవహరించంతో పాటు పాఠశాల యాజమాన్యంకు సమాచారం చేరవేసినట్లు తెలయడంతో కలెక్టర్ కి పిర్యాదు చేశారు. అదే విధంగా పాఠశాలల్లో నిబంధనలకు విరుద్ధంగా పాఠ్యపుస్తకాలు, నోట్ బుక్కలు, టై, బెట్లు, ఇతర వస్తువులు విక్రయిస్తున్నారని డి.ఈ.ఓ కి తెలిపితే అమ్మవద్దని రూల్ ఏం లేదని అనడం తో, ఈ విషయం కలెక్టర్ దృష్టి తీసుకెళ్లారు.జిల్లా కలెక్టర్  స్పందించాలని విద్యార్థుల తల్లి దండ్రులు,పట్టణ ప్రజలు కోరుతున్నారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333