సామాజిక బాధ్యతతో మరో ముందడుగు వేసిన నేటి సామాన్యుడు దిన పత్రిక

మృతి చెందిన శౌరయ్య కుటుంబానికి మానవత్వంతో ఆర్థిక సహాయం
మీడియా రంగంలో ఉన్న వారు ఇలాంటి కార్యక్రమాలు చేయడం అభినందనీయం
అని మెచ్చుకుంటున్న నేటి సామాన్యుడు దిన పత్రిక పాఠకులు , శ్రేయోభిలాషులు
తిరుమలగిరి మండల కేంద్రానికి చెందిన నిరుపేద కుటుంబానికి చెందిన శౌరయ్య కొద్దీ రోజుల క్రితం మరణించారు . మరణించిన శౌరయ్య కూతురు నేటి సామాన్యుడు దిన పత్రిక పాఠకురాలు తండ్రి మరణ వార్తను నేటి సామాన్యుడు దిన పత్రిక తెలుగు రాష్ట్రాల బ్యూరో చీఫ్ నజీర్ ఖాన్ ని ఫోన్ సంప్రదించి మా తండ్రి గారి అంత్యక్రియల అనంతరం జరిగే కర్మ కార్యక్రమానికి మా దగ్గర డబ్బులు లేవు ఎవరైనా దయార్ద్ర హృదయులు దాతలు ఉంటే వారి ఆర్థిక సహకారానికి ఎదురుచూస్తున్నాం అని ఒక పత్రిక ప్రకటన వేయగలరు అని విజ్ఞప్తి చేసిన సందర్భంగా మా వంతు సహాయంగా నేటి సామాన్యుడు దిన పత్రిక యాజమాన్యం మరియు అందులో పనిచేసే విలేకర్ల బృందం సహకారంతో 2 వేల రూపాయల నగదు , 50 కిలోల బియ్యాన్ని నేటి సామాన్యుడు దిన పత్రిక తెలుగు రాష్ట్రాల బ్యూరో చీఫ్ నజీర్ ఖాన్ చేతుల మీదుగా మృతి చెందిన శౌరయ్య కుటుంబ సభ్యులకు అందజేశారు . ఈ సందర్భంగా నేటి సామాన్యుడు దిన పత్రిక బ్యూరో చీఫ్ నజీర్ ఖాన్ మాట్లాడుతూ మృతి చెందిన శౌరయ్య కుటుంబానికి భవిష్యత్తులో కూడా నేటి సామాన్యుడు దిన పత్రిక అండగా ఉంటుందని అన్నారు . మీడియా రంగంలో ఉంటూ సామాజిక బాధ్యత , మానవత్వంతో మృతుని కుటుంబానికి అండగా నిలిచిన నేటి సామాన్యుడు దిన పత్రిక బ్యురో చీఫ్ నజీర్ ఖాన్ ని , యజమాన్యనాన్ని , విలేకర్ల బృందాన్ని నేటి సామాన్యుడు దిన పత్రిక పాఠకులు , శ్రేయోభిలాషులు అభినందించారు . మా కుటుంబానికి అండగా నిలిచిన నేటి సామాన్యుడు దిన పత్రిక చైర్మన్ నిమ్మరెడ్డి వెంకట్ రెడ్డి గారికి , తెలుగు రాష్ట్రాల బ్యూరో చీఫ్ నజీర్ ఖాన్ గారికి , తెలంగాణ ఇంచార్జ్ గుర్రం మల్లేష్ గారికి ధన్యవాదాలు తెలిపారు . ఈ కార్యక్రమంలో నేటి సామాన్యుడు దిన పత్రిక పెన్ పహాడ్ రిపోర్టర్ సిద్దూ , తుంగతుర్తి నియోజకవర్గ ఇంచార్జ్ పోచం కన్నయ్య తదితరులు పాల్గొన్నారు .