మన ఊరు మనబడి కి టీవీ బహుమతి చేసిన ఫ్రెండ్స్ యూత్

Mar 22, 2025 - 12:38
 0  21
మన ఊరు మనబడి కి  టీవీ బహుమతి చేసిన ఫ్రెండ్స్ యూత్

మన ఊరు మనబడి కి టీ వి బహుకరణ.. చేసిన ఫ్రెండ్స్ యూత్

 పెన్ పహాడ్ మండల తెలంగాణ వార్త మార్చి22

మన ఊరు మనబడి కి పూర్వ విద్యార్థుల చేయూత అభినందనీయమని ప్రధానోపాధ్యాయులు పిండిగ నర్సయ్య, పి ఆర్ టి యు టి ఎస్ రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షులు మామిడి వెంకన్న అన్నారు. శనివారం మండల పరిధిలోని ప్రాధమికోన్నత పాఠశాల దోసపహాడ్ ఫ్రెండ్స్ యూత్(మేముసైతం) సభ్యులు,కొండేటి శ్రీకాంత్ రెడ్డి, జూకూరిసతీష్, జ్ఞాపకార్థం.ఒకటీరెండవ,తరగతి విద్యార్థులకు ఐసిటి పాఠాలు బోధించుటకు. 15 వేల రూపాయల టీవీ ని ప్రధానోపాధ్యాయులకు అందజేశారు. ఈసందర్భంగా ప్రధానోపాధ్యాయులు నరసయ్య మాట్లాడుతూ దోసపహాడు గ్రామంలోని పూర్వ విద్యార్థులు,యువత, ఉద్యోగస్తులు, గ్రామస్తులు, పాఠశాల అభివృద్ధిలో భాగస్వాములు కావడం హర్షనీయమన్నారు. ఈ కార్యక్రమంలో సీనియర్ ఉపాధ్యాయులు రాయికింది వెంకటేశ్వర్లు, వై వెంకన్న, ఎస్ విప్ల కుమార్, ఫ్రెండ్స్ యూత్ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.

Harikrishna Penpahad Mandal Reporter Suryapet Dist Telangana State