అడ్డగూడూరు మండల కేంద్రంలో జాతీయ జెండాకు అవమానం
అడ్డగూడూరు 26 జనవరి 2025 తెలంగాణవార్త రిపోర్టర్:- యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూరు మండల కేంద్రంలో రాష్ట్ర రాజ్యాంగం అమలైన రోజు 26 జనవరి ప్రతి భారతీయుడికి ఓటు హక్కును కల్పించి ప్రజాస్వామ్యంలో ప్రతి పౌరుడు ప్రాముఖ్యతను తెలియజేసింది. ఇదే రోజు అలాంటి భారత రాజ్యాంగం అమలకు వచ్చిన రోజు అడ్డగూడూరు మండల కేంద్రంలో పోలీస్ స్టేషన్ కి ప్రక్కనే ఉన్న పాల ఉత్పత్తిదారుల సేవా కేంద్రం భవనం వద్ద ఈరోజు ఉదయం జెండా ఆవిష్కరణ చేశారు.కానీ సాయంత్రం వేళల్లో ఆ జెండాను తీసే నాధుడే లేడా? ఉంటే ఎక్కడ? జాతీయ జెండాను ఎగరవేయడం అది సాయంత్రం తీసివేయడానికి కొన్ని నియమ నిబంధనలు ఉన్నాయి కానీ అది పాటించలేదు అటుగా వెళుతున్న విలేఖరి కెమెరాకు చిక్కిన దృశ్యం నిత్యం ఆ దారి నుండే అధికారు లు, ప్రజా ప్రతినిధులు, ప్రజలు,నిత్యం అటుగా వెళుతుంటారు కానీ నాకేందిలే అన్నట్టుగా వ్యవహరించిన దృశ్యం జండా దారం కర్ర పైనే ఉంది జాతీయ జెండా మాత్రం నేలపై పడి ఉండడం అడ్డగూడూరు మండల కేంద్రంలో చోటు చేసుకుంది.