కాంగ్రెస్ పాలన పై విసుగు చెందిన ప్రజలు 

May 9, 2024 - 21:11
 0  22
కాంగ్రెస్ పాలన పై విసుగు చెందిన ప్రజలు 

★ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ని గెలిపించుకుందాం 

★ఎమ్మెల్సీ చల్లా వెంకట్రామిరెడ్డి .

★అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు . 

జోగులాంబ గద్వాల 9 మే 2024 తెలంగాణ వార్త ప్రతినిధి:- అలంపూర్ .*మండల కేంద్రంలోని బిఆర్ఎస్ పార్టీ అధినేత కెసిఆర్  బలపరిచిన ఎంపీ అభ్యర్థి *ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ కి మద్దతుగా ఎమ్మెల్సీ మరియు ఎమ్మెల్యే  అలంపూర్ రోడ్ షో ప్రచారం నిర్వహించడం జరిగింది.

 ఎమ్మెల్సీ  మరియు ఎమ్మెల్యే  మాట్లాడుతూ.... తెలంగాణ రాష్ట్ర ఉద్యమ నాయకుడు తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలకు ఎలాంటి మధ్యవర్తి లేకుండా నేరుగా సంక్షేమ పథకాలను అందించిన ఘనత కేసీఆర్ కి దక్కుతుందని స్పష్టం చేశారు. తెలంగాణ రాష్ట్రంలో బిఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఉన్నప్పుడు ప్రజలకు 24 గంటలు నాణ్యత మైన కరెంటును అందజేసేవారు. ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో చేపట్టినాక ప్రజలకు సమయానికి కరెంటు లేక ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొనే పరిస్థితి ఏర్పడింది ఎప్పుడు కరెంటు పోతుందో వస్తుందో తెలియని పరిస్థితి నేడు రాష్ట్రంలో ఏర్పడిందని గుర్తు చేశారు. 

గ్రామాలలో నీటి సమస్యతో ఇబ్బంది పడేవారు  కేసీఆర్  పాలనలో మిషన్ భగీరథ ద్వారా ప్రతి ఇంటికి   స్వచ్ఛమైన తాగునీటి ను అందించిన ఘనత మాది.  కానీ ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలో వచ్చిన 140 రోజులకు ప్రజలకు సరైన నీళ్లు తాగునీరు లేక ప్రజలు ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొనే పరిస్థితి కనిపిస్తుంది.  రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక ఏనాడు కూడా అధికారులతో ఏ ఒక్క సమీక్ష సమావేశంలో కూడా నిర్వహించలేదు ప్రజలను పట్టించుకున్న పాపాన పోలేదు.  కేవలం స్వార్ధ రాజకీయాల కోసం ప్రజల గురించి కనీసం కూడా ఆలోచన చేయడం లేదు వారు ఢిల్లీ నాయకులతో శభాష్గిరి కోసం ఇతర పార్టీల నాయకులను వారి పార్టీలోకి చేర్చుకొని దానిపైన దృష్టి పెట్టడం జరిగింది ఏనాడు కూడా ప్రజల సంక్షేమం గురించి కనీసం ఆలోచన చేయలేదు అని అన్నారు. 

అసెంబ్లీ ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ అధికారంలో కొస్తే  6 గ్యారెంటీలను  అమలు చేస్తామని ఎన్నో మాయమాటలు చెప్పారు.  . వృద్ధులకు 4000 పింఛన్ రాలేదు, గ్యాస్ సిలిండర్ రాలేదు , ప్రతి పేదవారి ఇంటికి 200 కరెంటు యూనిట్లు ఉచితం అన్నారు ఇంతవరకు అమలు కాలేదు. రైతులకు రైతుబంధు కేసీఆర్  10000 ఇస్తే మేము 15000 ఇస్తామని ఇంతవరకు ఏ రైతు ఖాతాలో కూడా రైతుబంధు జమ కాలేదు. ఇప్పటివరకు ఏ ఒక్క హామీని కూడా ఏ ఒక్క గ్యారెంటీని కూడా అమలు చేయలేక పోయారు ఆరు గ్యారెంటీలలో కాంగ్రెస్ పార్టీ అమలు చేయలేక విఫలం అయ్యారని తెలిపారు.

బిఆర్ఎస్ నాగర్ కర్నూల్ పార్లమెంటు పార్లమెంట్ అభ్యర్థి  ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ ని మే 13వ తేదీ నాడు కారు గుర్తుపైన ఓటు వేసి వేయించి అత్యధికమైన మెజార్టీతో గెలిపించాలని కోరారు.

ఈ కార్యక్రమంలో  జడ్పీటీసీ లు, ఎంపీపీ లు, సర్పంచ్ లు, సింగిల్ విండో అధ్యక్షులు,వివిధ మండల స్థాయి నాయకులు,బిఆర్ఎస్ పార్టీ నాయకులు ,కార్యకర్తలు తదితరులు భారీ ఎత్తున పాల్గొన్నారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333