మాధవరం యువకునికి ముకుందాపురం వద్ద రోడ్డు ప్రమాదం

మాధవరం గ్రామానికి చెందిన దాసరి సంజయ్ (21) సుమారు 7:30 గంటల సమయంలో కోదాడ నుండి తన స్వగ్రామమైన మాధవరం వస్తుండగా ముకుందాపురం గ్రామ శివారులో రోడ్డు పక్కన ఉన్న వ్యక్తిని అతివేగంగా వచ్చి ఢీకొట్టడంతో తాను ప్రయాణిస్తున్న మోటార్ సైకిల్ అదుపుతప్పి డివైడర్ను ఢీకొట్టడం జరిగింది. సంజయ్ కు బలమైన గాయాలు కాగడంతో కోదాడ ఆసుపత్రికి తరలించగా మెరుగైన చికిత్స నిమిత్తం సూర్యాపేట ఏరియా ఆసుపత్రికి తరలించినట్లు సమాచారం. ప్రస్తుతం సంజయ్ పరిస్థితి విషమంగా ఉన్నట్లు వెంటిలేటర్ పై శ్వాస తీసుకుంటున్నట్లు సమాచారం. రోడ్డు పక్కన నిలబడి ఉన్న వ్యక్తిని ద్విచక్ర వాహనం ఢీకొట్టడంతో ఆ వ్యక్తికి కాలు విరిగినట్లు సమాచారం.