తిరుమలగిరిలో ధర్నా భారీగా నిలిచిపోయిన వాహనాలు
తిరుమలగిరి 23 సెప్టెంబర్ 2024 తెలంగాణ వార్త రిపోర్టర్
తెలంగాణ చౌరస్తాలో చిన్న చిన్న వ్యాపారం చేసుకునే ఎంతోమంది జీవితాలు అండర్ పాస్ నిర్మించడం వల్ల అంధకారమైపోతాయని అన్నారు. సూర్యాపేట జిల్లా తిరుమలగిరి మండల కేంద్రంలోని అఖిలపక్షం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ వలిగొండ నుండి తిరుమలగిరి మీదుగా తొర్రూర్ వరకు నేషనల్ హైవే పనులు సాగుతున్నాయని, తిరుమలగిరి మున్సిపాలిటీ కేంద్రం ఇప్పుడిప్పుడే వ్యాపార పరంగా అభివృద్ధి చెందుతున్న క్రమంలో తెలంగాణ చౌరస్తాలోని హైవే రోడ్డుపై అండర్ పాస్ ఏర్పాటు చేయడంతో పాత గ్రామానికి ఎక్స్ రోడ్డుకు అడ్డంగా గోడ కట్టినట్లుగా ఉంటుందని తెలిపారు. సూర్యాపేట_జనగాం, వలిగొండ_తొర్రూర్ రోడ్డు కు ఇరు ప్రక్కల ఎంతోమంది చిరు వ్యాపారులు చిన్న చిన్న షాపులు, రోడ్డు పక్కన తోపుడు బండ్లు, బట్టి కొట్లు పెట్టుకొని జీవనం సాగిస్తున్నారని, అండర్ పాస్ తో వ్యాపారాలు పూర్తిగా దెబ్బతింటాయని, చిరు వ్యాపారుల సుమారు 500 కుటుంబాలు, ఆయా షాపులలో పనిచేసే మందితో కలిపి 1000 కుటుంబాలు వీధిన పడతాయని తెలిపారుఎంతోమంది చిరు వ్యాపారుల జీవితాలు అంధకారం చేసే విధంగా రోడ్డు అండర్ పాస్ నిర్మాణం చేయడం వలన చిరు వ్యాపారుల జీవనాధారం పోతుందని ఆమరణ నిరాహార దీక్ష కైనా సిద్ధపడతామని అండర్ పాస్ నిర్మాణాన్ని అడ్డుకుంటామని చెప్పారు. ప్రజలకు ప్రభుత్వాలు వ్యతిరేకంగా పనులు చేయవద్దని తెలిపారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి ప్రజల అభిప్రాయం మేరకు అండర్ పాస్ లేకుండా బైపాస్ రోడ్డును తీసుకుని, లేదా ఈ ప్రాంతంలో సిగ్నల్ వ్యవస్థ ఏర్పాటు చేసి వెళ్లాలని కోరారు. ఈ సమావేశంలో అఖిలపక్ష నాయకులు సుంకరి జనార్ధన్ కొమ్మినేని సతీష్ కుమార్, మూల రవీందర్ రెడ్డి, బత్తుల శ్రీను, గుండా భాస్కర్, గజ్జల శేఖర్, కడెం లింగయ్య, కొత్తగట్టు మల్లయ్య, ఎస్. కొండల్ రెడ్డి, కందుకూరి సోమన్న, రాంబాబు, భాస్కర్, మధు, నాని, కందుకూరి ప్రవీణ్, అనగందుల మల్లేష్ తదితరులు పాల్గొన్నారు.