జిల్లా గ్రంధాలయ చైర్మన్ గా పదవి ప్రమాణం చేసిన వంగవీటి రామారావు ,

Oct 21, 2024 - 21:32
 0  55
జిల్లా గ్రంధాలయ చైర్మన్ గా పదవి ప్రమాణం చేసిన వంగవీటి రామారావు ,

*గ్రంధాలయాలను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిది*

*జిల్లా గ్రంధాలయ చైర్మన్ గా పదవీ ప్రమాణం చేసిన వంగవీటి రామారావు* 

*కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరై మాట్లాడిన కోదాడ ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి, మాజీమంత్రి కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి రామ్ రెడ్డి దామోదర్ రెడ్డి*

*గ్రంధాలయాలు విజ్ఞాన బండాగారాలని అలాంటి గ్రంధాలయాలను కాపాడుకోవాల్సిన బాద్యత ప్రతి ఒక్కరిపై ఉందని కోదాడ శాసనసభ్యురాలు నలమాద ఉత్తమ్ పద్మావతి, మాజీ మంత్రి సూర్యాపేట నియోజకవర్గ కాంగ్రెస్ ఇంచార్జి రాంరెడ్డి దామోదర్ రెడ్డిలు అన్నారు.* సోమవారం జిల్లా గ్రంధాలయంలో జిల్లా గ్రంధాలయ చైర్మన్గా వంగవీటి రామారావుచే పదవి ప్రమాణ స్వీకారోత్సవం జరిపించి వారు మాట్లాడారు. *ప్రతి ఒక్కరి విజ్ఞానాన్ని పెంపొందించడానికి గ్రంధాలయాలు ఉపకరిస్తాయన్నారు.* గ్రంధాలయాలు తండ్రిలా ఆదేశించి తల్లిలా లాలించి గురువులా బోదించి మిత్రుడిలా ఆదుకుంటాయన్నారు. *సమాజ వికాసానికి మూల స్తంబాలుగా గ్రంధాలయాలు ఉన్నాయని ప్రతి ఒక్కరు తమ పిల్లలకు గ్రంధాలయాలకు వెళ్ళడం అలవాటు చేయాలన్నారు.* గ్రంధాలయాల సమస్యలపై అసెంబ్లీలో ప్రస్తావించడంతో పాటు గ్రంధాలయాలకు గ్రామ పంచాయితీలు, మున్సిపాల్టీల నుంచి రావాల్సిన సెస్ వచ్చేలా కృషి చేసి అభివృద్ధికి పాటుపడుతామన్నారు *గ్రంధాలయాల్లో పుస్తకాలతో పాటు కంప్యూటర్స్ ఏర్పాటుకు కృషి చేస్తామన్నారు.* అనంతరం జిల్లా గ్రంధాలయ చైర్మన్ గా వంగవీటి రామారావుతో పదవి ప్రమాణం చేయించి బాధ్యతలను అప్పగించి ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఎఐసీసీ సభ్యులు రాంరెడ్డి సర్వోత్తం రెడ్డి, డిసిసి అధ్యక్షులు చెవిటి వెంకన్నయాదవ్, పబ్లిక్ క్లబ్ సెక్రటరీ కొప్పుల వేణారెడ్డి, రాష్ట్ర గ్రంధాలయ సంస్థ చైర్మన్ రియాజ్, సాగర్ లెఫ్ట్ కెనాల్ అధ్యక్షులు లక్ష్మినారాయణ, జిల్లా గ్రందాలయ కార్యదర్శి బాలమ్మతో పాటు స్థానిక ప్రజాప్రతినిధులు, గ్రంధాలయ ఉద్యోగులు, సిబ్బంది పెద్ద ఎత్తున నాయకులు, పాఠకులు పాల్గొన్నారు.

Shake Jaheer Staff Reporter Suryapet District Telangana 508223