ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు
మునగాల 14 ఏప్రిల్ 2024 తెలంగాణవార్త ప్రతినిధి :- నేరేడుచర్ల మండల పరిధిలోని పెంచికలదిన్నె గ్రామంలో అంబేద్కర్ 133వ జయంతిని సందర్భముగా వారి చిత్ర పటానికి స్థానిక ఎస్సై రవీందర్ నాయక్ ముఖ్యఅతిథిగా విచ్చేసి అంబేద్కర్ కి పూలమాలతో ఘనంగా సత్కరించారు.ఈ సందర్భంగా రవీందర్ నాయక్ మాట్లాడుతూ అంబేద్కర్ న్యాయవాదిగా ఆర్థిక శాస్త్రవేత్తగా రాజకీయ నేతగా భారతదేశపు మొట్టమొదటి కేంద్ర న్యాయశాఖ మంత్రిగా పనిచేశారని, అంటరానితనం కుల నిర్మూలన కోసం ఎంతగానో కృషి చేశారని, అన్నారు ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షులు ఎడవల్లి అరుణ్ , జిల్లా గ్రామ కార్యదర్శి శ్రీనివాసులు , ఎమ్మార్పీఎస్ జిల్లా నాయకులు ఎడవల్లి చంద్రయ్య , ఎమ్మార్పీఎస్ సీనియర్ నాయకులు ఎడవల్లి వెంకటకృష్ణ , పెంచికలదిన్నె జై భీమ్ కమిటీ అధ్యక్షులు వూట్కూరి భార్గవ్ సైదులు , పసుపులేటి ఫౌండేషన్ వైస్ ప్రెసిడెంట్ నరసింహారావు , కందుల మురళి , పిండెం హరి బాబు , ఎమ్మార్పీఎస్ నాయకులు వడ్ల ముడి ఉపేందర్ , ఎమ్మార్పీఎస్ నాయకులు ఎడవల్లి అజయ్ , గణేష్ , నవీన్ , పవన్ , రవి , నాగరాజు , రామకృష్ణ , ప్రమోద్ , జీ సైదులు , రామకృష్ణ , స్టాలిన్ , సైదులు , ఆర్కే , రాము , ఎస్ కే జానీ , శ్రీను తదితరులు పాల్గొన్నారు.