క్రీడలతోనే అంతర్జాతీయ గుర్తింపు.
క్రీడలతోనే అంతర్జాతీయ గుర్తింపు..సి యం కప్ -2024 టార్చ్ ని వెలిగించి ర్యాలీ ని ప్రారంభించిన
తెలంగాణ వార్త సూర్యపేట జిల్లా ప్రతినిధి.
జిల్లా కలెక్టర్
తేజస్ నంద్ లాల్ పవార్..
జిల్లా ఎస్ పి సన్ ప్రీత్ సింగ్.
క్రీడలతోనే అంతర్జాతీయ గుర్తింపు వస్తుందని జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ అన్నారు. గురువారం సి యం కప్ -2024 టార్చ్ ని ఎస్ వి ఇంజనీరింగ్ కళాశాల వద్ద వెలిగించి జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్, ఎస్ పి సన్ ప్రీత్ సింగ్ తో కలిసి ర్యాలీ ని జెండా ఊపి ప్రారంభించారు.ఈ సందర్బంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ విద్యార్థులు చదువు తోపాటు క్రీడలపై శ్రద్ద పెట్టి గుర్తింపు తెచ్చుకోవాలని అన్నారు. ఓలంపిక్ క్రీడా పోటీలలో తెలంగాణ రాష్ట్రం నుండి పథకం తేచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం క్రీడ లకు అధిక ప్రాధాన్యతను ఇస్తుందని కలెక్టర్ తెలిపారు.పల్లెల నుండి ప్రపంచ స్థాయి విజేత కొరకు నినాదం తో క్రీడా కారులతో సి యం కప్ -2024 టార్చ్ ని రాష్ట్రమంతా పర్యటన చేస్తున్నారని తెలిపారు.సీఎం కప్ -2024 టార్చ్ ర్యాలీ ఎస్ వి ఇంజనీరింగ్ కాలేజీ నుండి సంతోష్ బాబు చౌరస్తా మీదుగా కొత్త బస్టాండ్ వరకు తీశారు.
ఈ కార్యక్రమం లో రేజిలింగ్ కోచ్ నందకిషోర్, నోడల్ అధికారి మధు , స్పోర్ట్స్ స్కూల్ స్పోర్ట్స్ అధికారిబ ఆర్ కె బోస్ , చీప్ అట్లేటిక్ కోచ్ యం డి గౌస్ ,డి వై ఎస్ ఓ రామ చంద్రరావు,అదనపు ఎస్ పి జనార్దన్ రెడ్డి,క్రీడా కారులు,పి ఈ టి లు, ఉపాధ్యాయులు, యువజన సంఘం నాయకులు, విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు...